ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (18:33 IST)

పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగితే...?

జాజికాయను తాంబూలం దినుసులలో, వక్కపొడి తయారీలోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంగా వాడినట్లయితే కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. విరేచనాలను అరికడుతుంది. తాంబూలంలో వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపును, గారనూ తొలగించి.. దంతాలు మెరిసేలా చేస్తుంది.
 
అధిక దాహాన్ని తగ్గిస్తుంది. అలసట వలన వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మలబద్ధకం ఏర్పడకుండా చేస్తుంది. వికారాన్ని, వాంతులను నియంత్రిస్తుంది. 
 
దగ్గు, జలుబు, కఫానికి మంటి టానిక్‌లా పనిచేస్తుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగితే గుండెల్లో జరుపు, నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మం కాంతి పెరగడమే కాకుండా చర్మం ముడతలు పడదు.