బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (11:36 IST)

వెలగపండు గుజ్జును నేతిలో వేయించి....?

కడుపులో యాసిడ్లు అతిగా పేరుకుపోయి, తీసుకున్న ఆహారం జీర్ణంకాక పోతున్నప్పుడు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూ చాలా బాధను కలిగిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఈ కింది చిట్కాల్లో చూసి తెలుసుకుందాం..
 
1. ఎండిన ఉసిరికాయలలో గింజలు తీసేసి, పిప్పళ్ళనూ, శొంఠిని విడివిడిగా నేతిలో వేయించి, మూడింటినీ సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి, కొంచెం పంచదార కలుపుకుని శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఓ చెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి తింటే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. పొడిని మజ్జిగలో కూడా వేసుకుని తీసుకోవచ్చును.
 
2. యష్టిచూర్ణం ఆయుర్వేద మందుల షాపులో, నేరుగా దొరుకుతుంది. దీన్ని అరచెంచా తీసుకుని కొంచెం తేనెలో కలిపి రెండు మూడు గంటలకోసారి తీసుకోవాలి. 
 
3. వెలగపండు గుజ్జును నేతిలో వేయించి దంచి, రసంతీసి, తేనెగానీ, పంచదార కలిపిగానీ తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 
 
4. ఎండుఖార్జరం, ఎండుద్రాక్ష, నేతిలో వేయించిన పిప్పళ్ళపొడి, పంచదార ఇవన్నీ సమభాగాలుగా దంచి, తేనెతో కలిపి అరచెంచా మోతాదులో రోజూ రెండుమూడుసార్లు తీసుకుంటుంటే పైత్యం తగ్గించి, ఎక్కిళ్ళు రాకుండా అరికడుతుంది.