శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (11:07 IST)

పొట్ట దగ్గరి కొవ్వు కరిగించాలంటే.. ఏం చేయాలి..?

నేటి తరుణంలో చాలామంది కడుపు ఉబ్బరంతో ఎక్కువగా బాధపడుతున్నారు. దాంతో పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సమస్య అనేకమందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ కొవ్వు కారణంగా హైబీపీ, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు వైద్యులు. మరి అవేంటో చూద్దాం...
 
1. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వలన పొట్ట దగ్గరి కొవ్వు కొద్దిగైనా తగ్గుతుంది. అలానే వంట నూనె ఎంపికి చేసే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవలెను. నిద్రలేమి కారణంగా కూడా పొట్ట దగ్గరి కొవ్వు అధికమవుతుందని చెప్తున్నారు. కనుక వీలైనంత వరకు రోజుకు సరైన సమయంలో నిద్రిస్తే సరిపోతుంది.
 
2. చక్కెర శాతం ఎక్కువగా ఉండే స్వీట్స్, తీపి పదార్థాలు తీసుకోవడం మానేయాలి. ప్రతిరోజూ మీరు తీసుకునే అన్నానికి బదులుగా గోధుమలు, ముడిబియ్యం వంటివి తింటే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించవచ్చును.
 
3. ఈ కొవ్వును కరిగించాలంటే.. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ, నిమ్మరసం వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక భోజనాంతరం గ్లాస్ మజ్జిగ లేదా నిమ్మరసం తాగండి.. తప్పక ఫలితం ఉంటుంది.
 
4. ఆల్కహాల్ అధికంగా సేవిస్తే కూడా పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం కాస్త తగ్గించండి. దీంతో శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గుముఖం పడుతాయి.
 
5. తరచు వాకింగ్, వ్యాయామాలు, యోగాసనాలు చేస్తే కూడా కొవ్వు కరుగుతుంది. బరువు అధికంగా ఉన్నవారికి పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు తప్పక పైన తెలిపిన విధంగా చేస్తే కొవ్వు కరిగిపోతుంది.