శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (13:20 IST)

అరటిపండుని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడి కలిపి తింటే?

ఇంట్లో వండే పదార్థాలకు పోపు వేసేటపుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరపకాయలు ఉపయోగిస్తారు. అందులో వేసే జీలకర్ర శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర పొడి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని సమతూకంలో ఉంచుతుంది. కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిగి తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది.
 
5 ఎండుమిర్చి, 2 స్పూన్ల జీలకర్ర వీటిల్లో కొద్దిగా నూనె వేసి బాగా వేయించుకోవాలి. ఆపై 3 టమోటాలు, ఓ ఉల్లిపాయను వేయించాలి. ఇలా చేసిన వాటిలో కొద్దిగా చింతపండు వేసి మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా నూరుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే ఆ రుచే వేరు. నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ పదార్థాలు తయారుచేసి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 
జీలకర్ర రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీలకర్ర యాంటీ ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండడం వలన శరీరంలో చేరిన మురికిన, ప్రీ రాడికల్స్‌ను తొలగించి వ్యాధులను తట్టుకునే విధంగా శరీరరోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సాహిస్తుంది. పైత్యరసం ఫాట్స్‌ను విభిన్నం చేయడంలో పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. 
 
కడుపులోని గ్యాస్‌ని బయటకు పంపుతుంది. అరటిపండుని తీసుకుని దాన్ని బాగా నలిపి దాంట్లో కొద్దిగా జీలకర్ర పొడి కలిపి తింటే.. హాయిగా నిద్రవస్తుంది. అధిక బరువు తగ్గుతారు. లైంగిక ఆరోగ్యం పెంపొందాలంటే.. జీలకర్ర పొడిని తీసుకోవాలని చెప్తున్నారు. జీలకర్రను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నీరు, నిమ్మరసం, ఉప్పు కలిగి తాగితే నోటికి రుచిగా ఎంతో బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని తరచు సేవిస్తే.. అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది.