శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (15:43 IST)

ఈ 4 చిట్కాలు పాటిస్తే.. స్ట్రెస్‌ ఔట్...

ఒత్తిడిని చాలా తీవ్రమైన జబ్బుగా వైద్యులు పరిగణిస్తున్నారు. శరీరంలోని హార్మోనులు వేగంతో కాకుండా మరింత వేగంగా పనిచేయడం వలన ఒత్తిడి కలుగుతుంది. తాత్కాలికమయితే పర్వాలేదు. కానీ, ఆ ఒత్తిడి నిరంతర ప్రక్రియ అయితే ఆ హార్మోనులు శరీరానికి, మానసిక సామర్ధ్యానికి కూడా హాని కలిగిస్తాయి. కనుక మీపై గల ఒత్తిడిని తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. ఈ కింద సూచించిన సూచనలు పాటించి చూడండి.. ఫలితం ఎంతో ఉంటుంది.
 
1. కాఫీ, టీలు తాగడం తగ్గించి మంచినీరు ఎక్కువగా సేవించాలి. అలసట, మానసిక ఒత్తిడులతో బాధపడేవారికి తేనె దివ్యౌషధం. తేనెను పాలలో కానీ, నిమ్మరసంలో కానీ కలుపుకుని తాగినా, అలానే తీసుకున్నా తేనె ఎంతో ఉపశాంతినిస్తుంది.
 
2. మంచి పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలి. సరదాగా నవ్వుతూ ఉండాలి. ముఖంపై చిరునవ్వు చెరగనివ్వవద్దు. ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. రాత్రి త్వరగా నిద్రపోవాలి. 
 
3. మధ్యాహ్నం వీలుంటే విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. నిద్రపోకూడదు. జీవితంపై ఆశాభావం పెంచుకోవాలి. ప్రకృతితో సాన్నిహిత్యం పెంచుకోవాలి. మొక్కలను నాటి వాటి పెరుగుదలను ప్రతిరోజూ గమనిస్తూ ఉండాలి.
 
4. మీ సమస్యలను, సంతోషాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించాలి. చివరగా మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇష్టం లేనివి చేయవద్దు. చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగ, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వంటివి చేయడం ద్వారా స్ట్రెస్‌ను తగ్గించుకోవచ్చు.