శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (12:10 IST)

జాజికాయ, అశ్వగంధతో శృంగార సామర్థ్యం పెంపు

ఆయుర్వేదంలో కీలకమైన జాజికాయ, అశ్వగంధ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అశ్వగంధలో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం ఎక్కువగా ఉంది. నిత్యం కొంత అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని తాగుతుంటే శృంగార సామర్థ్యం బాగా

ఆయుర్వేదంలో కీలకమైన జాజికాయ, అశ్వగంధ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అశ్వగంధలో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం ఎక్కువగా ఉంది. నిత్యం కొంత అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని తాగుతుంటే శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఉత్తేజంగా ఉంటారు. రతి క్రీడలో చురుగ్గా పాల్గొంటారు. కేవలం 15 రోజుల పాటు ఈ పొడిని వాడితే ఫలితం ఉంటుంది. 
 
అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు జాజికాయలో ఉన్నాయి. వీటి పొడిని రోజూ పాలలో కలుపుకుని తాగితే ఆ శక్తి పెరగడమే కాదు, వీర్య వృద్ధి అవుతుంది. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. నరాల బలహీనత ఉంటే పోతుంది. వెల్లుల్లిని పచ్చిగా తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే  అల్లం రసాన్ని తీసి రోజూ తాగుతుంటే శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. వీర్య వృద్ధి అవుతుంది.
 
ఇదే విధంగా.. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి  టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి తోడ్పడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.