గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (14:06 IST)

కరక్కాయ పొడిని రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే?

శరీరానికి తగని.. రుచిగా వుండే ఆహారాన్ని మితిమీరి తీసుకోవడం ద్వారానే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిద్ధులు చెప్తున్నారు. వాత, పిత్త, కఫ అనే మూడింటిలో ఏది తగ్గినా అనారోగ్యం తప్పదు. వాత, పిత్త, క

శరీరానికి తగని.. రుచిగా వుండే ఆహారాన్ని మితిమీరి తీసుకోవడం ద్వారానే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిద్ధులు చెప్తున్నారు. వాత, పిత్త, కఫ అనే మూడింటిలో ఏది తగ్గినా అనారోగ్యం తప్పదు. వాత, పిత్త, కఫాలు ఎక్కువైనా, తక్కువైనా జబ్బులు తప్పవు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే.. సిద్ధులు ఇలాంటి చిట్కాలు పాటించాలంటున్నారు. ఆవు పాలను తీసుకోవాలి.

నూనె పదార్థాలు ఎక్కువ తీసుకున్న రోజుల్లో వేడి నీటితో స్నానం చేయడం.. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వార అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా శరీరం, ఆత్మ, బుద్ధిని క్రమబద్ధీకరించడంలో కరక్కాయ భేష్‌గా పనిచేస్తుంది. కరక్కాయను తీసుకుని.. లోపల వుండే గింజలను తీసేసి.. బాగా పొడి కొట్టుకోవాలి. అలా పొడి చేసుకున్న కరక్కాయ పొడిని రోజూ ఓ స్పూన్ రాత్రి ఆహారం తీసుకున్నాక తీసుకుంటే వ్యాధులు దరిచేరవు.  
 
ఇంకా వ్యాధులు రాకుండా వుండాలంటే సిద్ధవైద్యం ప్రకారం ఈ చిట్కాలు పాటించాలి. 
* రోజుకు రెండుసార్లు పుష్టిగా భోజనం చేయాలి. ఆకలేస్తేనే ఆహారం తీసుకోవాలి. 
* రాత్రి పూట మాత్రమే నిద్రించాలి. 
* పులుపెక్కిన పెరుగును తీసుకోవాలి. 
* ఆవు పాలను తీసుకోవాలి
* వారానికి ఒకసారి.. వేడినీటి స్నానం తప్పనిసరి. 
 
అలాగే ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని ప్రతి రోజూ సేవిస్తారు. త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఋతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. ఋతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడడం మంచిది. త్రిఫలా చూర్ణం గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

కళ్ళు, చర్మ ఆరోగ్యానికి మంచిది. త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు క్రమం తప్పక తీసుకుంటే, జుట్టు అంత త్వరగా తెల్లగా మారదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీని ప్రభావం వల్ల ముసలితనం త్వరగా రాదు. జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడంలో త్రిఫల చూర్ణం చక్కగా ఉపకరిస్తుంది. ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.