శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (20:18 IST)

జీడిపప్పుల్ని గర్భిణీ స్త్రీలు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

జీడిపప్పుల్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీడిపప్పుల్లోని గుడ్ కొలెస్ట్రాల్, విటమిన్ ఎ, డి, ఈ, కేలు ఇందులో వున్నాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రక్త హీనతకు ఇవి చెక్ పెడుతాయి. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడతాయి. హృద్రోగ వ్యాధులను దూరం చేస్తుంది. జీడిపప్పులోని కాపర్, ఐరన్.. రక్త కణాల వృద్ధికి తోడ్పడుతాయి. 
 
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటాన్ని జీడిపప్పులు నివారిస్తాయి. జీడిపప్పుల వలె పప్పు దినుసులు, నట్స్, తృణధాన్యాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అనారోగ్య సమస్యలను దరిచేర్చవు. ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి. జీడిపప్పులను గర్భిణీ స్త్రీలు తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.