బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By
Last Updated : శుక్రవారం, 28 డిశెంబరు 2018 (12:09 IST)

బియ్యపు పిండిని పాలలో కలిపి తీసుకుంటే..?

పసిపిల్లలకు తల్లిపాలు చాలా ముఖ్యం. కానీ, కొన్ని కారణాల వలన తల్లిపాలు పిల్లలకు సరిపడవు. అందుకని అలానే వదిలేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. పసిపిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే అంత మంచిది. పాలు అయిపోతే పోతపాలు పట్టొచ్చుకదాని అశ్రద్ద చేయకుండా తల్లిపాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
 
1. బియ్యపు పిండిని పాలలో వేసి ఉడికించి రోజుకు మూడుపూట్ల జావగా తాగుతుంటే.. తల్లిపాలు వృద్ధి చెందుతాయి. 
 
2. రోజూ బొప్పాయి పండు తింటుంటే పాలు వృద్ధి చెందుతాయి. బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటివి అధికంగా ఉంటాయి. తరచు తల్లులు ఈ పండును తింటే.. ఫలితం ఉంటుంది.
 
3. పత్తి చెట్టువేళ్ళు, చెరుకు వేళ్ళు రెంటినీ మెత్తగా నూరి, చక్కని పేస్ట్‌లా చేసుకుని, ఒక చెంచా పేస్ట్‌ను గ్లాస్ పాలలో వేసి, నాలుగోవంతు మిగిలేలా కాచి, వడగట్టి తాగితే పాలు పెరుగుతాయి. 
 
4. బాలింత స్త్రీలు బ్రడ్, పాలు ఎక్కువ తీసుకుంటుంటే పాలు వృద్ధి చెందుతాయి.
 
5. గాలకోల్, గాలక్టోన్ అనే ఆయుర్వేద బిళ్ళలు రోజులో పూటకు రెండు చొప్పున వేసుకుంటూ.. శతావరెక్స్ అనే పొడిని పాలలో కలిపి తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి.