1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (18:17 IST)

వర్కింగ్ ఉమెన్ ఉదయం బాదం పప్పులు తీసుకుంటే..?

బాదంలో క్యాల్షియం పుష్కలంగా ఉండటంతో హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. నిజానికి ఉద్యోగం చేసే మహిళలు.. ప్రతిరోజూ ఉదయం బాదం తినడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గిస్తుంది. అలాగే జీడిపప్పు, డ్రైడ్ ఆప్రికాట్‌లో కాపర్ పుష్కలంగా ఉంది. ఇది శరీరంలో ఐరన్ నిల్వ చేయడానికి గ్రేట్‌గా సహాయపడుతుంది. 
 
ఇది శరీరంలో కండరాలు గ్రేట్‌గా పనిచేయడానికి సహాయపడుతుంది. వాల్ నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రెగ్నెంట్ మహిళలకు చాలా గొప్పగా ఉపయోగపడుతాయి. పొట్టలో పెరిగే శిశువు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
 
అలాగే పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి కావలసిన మెగ్నీషియాన్ని పుష్కలంగా అందిస్తాయి. తద్వారా ఎముకలు బలంగా తయారవుతాయి. అంతేగాకుండా.. శరీరంలో జీవక్రియలను, థైరాయిడ్, బ్లడ్ షుగర్‌ను రెగ్యులేట్ చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు.