1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 9 అక్టోబరు 2023 (12:44 IST)

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు

Telangana Assembly Elections
తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ నవంబర్ 3నుంచి డిసెంబర్ 5 వరకు కొనసాగనుంది.
 
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: 3 నవంబర్ 2023 (శుక్రవారం)
నామినేషన్లకు ఆఖరు తేదీ: 10 నవంబర్ 2023 (శుక్రవారం)
నామినేషన్ల పరిశీలన: 13 నవంబర్ 2023 (సోమవారం)
అభ్యర్థిత్వం ఉపసంహరణకు తుది తేదీ: 15 నవంబర్ 2023
పోలింగ్ తేదీ: 30 నవంబర్ 2023
ఓట్ల లెక్కింపు: 3 డిసెంబర్ 2023