ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 21 మే 2022 (23:38 IST)

కేసీఆర్: ‘‘మా టీచర్లను దిల్లీకి పంపిస్తాం.. అక్కడ విద్యా విధానం చాలా బావుంది’’

cmkcr
‘‘విద్యా రంగంలో దిల్లీ ప్రభుత్వం ప్రశంసనీయంగా పనిచేస్తోంది. ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు క్పలించే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఈ విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించాలి’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

 
‘‘దిల్లీలో విద్యా విదానంపై అవగాహన కల్పించేందుకు మా టీచర్లు, నాయకులను ఇక్కడకు తీసుకొస్తాం’’ అని కేసీఆర్ వివరించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి శనివారం మోతీబాగ్‌లోని ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు.

 
దిల్లీ మొహల్లా క్లినిక్‌లపైనా కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మంచి విధానాలను మొదలుపెట్టేందుకు మేం భిన్న రాష్ట్రాల్లోని విధానాలను పరిశీలించాం. అప్పుడు మొహల్లా క్లినిక్‌ల నుంచి మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో మా రాష్ట్రంలోనూ వీటిని ప్రారంభించాం’’ అని కేసీఆర్ అన్నారు.