దోసకాయ జ్యూస్‌తో చర్మానికి మేలెంత? స్కిన్‌కు తేనే రాస్తే?
దోసకాయ జ్యూస్‌తో చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. దోసకాయ రసం తీసుకోవడం ద్వారా అలసిన కళ్ళకు ఉరట కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. దోసకాయ వలన కంటి కింద చర్మం పైన ఉండే నల్లటి వలయాలను తొలగించుకోవచ్చ
దోసకాయ జ్యూస్‌తో చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది. దోసకాయ రసం తీసుకోవడం ద్వారా అలసిన కళ్ళకు ఉరట కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. దోసకాయ వలన కంటి కింద చర్మం పైన ఉండే నల్లటి వలయాలను తొలగించుకోవచ్చు.
ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే.. తాజా దోసకాయ రసాన్ని, కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా మూడు నెలల పాటు ఉంచితే నల్లటి వలయాలు మటాష్ అవుతాయి. చర్మం జిడ్డుగా ఉంటే.. చల్లటి మంచు గడ్డ కలిపిన పాలను ముఖానికి వాడండి. దీనివలన చర్మం పైన ఉండే నూనెలు తొలగిపోతాయి.
చర్మానికి తేనే రాయటం వలన మెరుగైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మం పైన ఉండే మచ్చలకు, మరకలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కారణం ఇది 'యాంటీ-బ్యాక్టీరియా' గుణాలను కలిగి ఉండటం వలన. అంతేకాకుండా, తేనే వలన చర్మం సున్నితంగా మారుతుంది.