మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (17:19 IST)

పెట్రోలియం జెల్లీతో సౌందర్యం..

శీతాకాలం వచ్చేస్తోంది. పెట్రోలియం జెల్లీకి కాస్త పంచదార కలిపి ముఖానికి రాసుకుని.. మృదువుగా రుద్దితే మృత కణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. చేతి గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం వారంలో రెండు

శీతాకాలం వచ్చేస్తోంది. పెట్రోలియం జెల్లీకి కాస్త పంచదార కలిపి ముఖానికి రాసుకుని.. మృదువుగా రుద్దితే మృత కణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. చేతి గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం వారంలో రెండు మూడుసార్లైనా కాస్త పెట్రోలియం జెల్లీని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. రాత్రిళ్లు పాదాలకు కాస్త పెట్రోలియం జెల్లీని రాసుకుని సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే పగుళ్లు పోయి పాదాలు మృదువుగా మారతాయి.
 
చేతి మణికట్టుపై పరిమళం కోసం పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం ద్వారా చర్మం పొడిబారదు. మోచేతులూ, మోకాళ్లూ పొడిబారి, బరకగా కనిపిస్తే.. ప్రతీరోజూ పెట్రోలియం జెల్లీని రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేస్తే చర్మానికి తగిన తేమ అంది తాజాగా కనిపిస్తుంది.
 
పెట్రోలియం జెల్లీ మేకప్‌ను తొలగిస్తుంది. రసాయానాలతో కూడిన రిమూవర్‌లకి బదులుగా దీని సాయంతో మస్కారా, లిప్‌స్టిక్‌, ఐలైనర్లను సులభంగా తొలగించవచ్చు. తలకు రంగు వేసుకునేముందు దీన్ని నుదుటిపై భాగాన, మెడదగ్గరా కాస్త రాసుకోండి. దానివల్ల రంగు అంటకుండా ఉంటుంది. నెయిల్‌ పాలిష్‌ వేసుకునే ముందు గోళ్లకు రెండు వైపులా పెట్రోలియం జెల్లీ రాయాలి. దీనివల్ల రంగు చర్మానికి అంటుకోకుండా ఉంటుంది. 
 
లిప్‌ స్క్రబ్‌ కోసం కొంచెం పంచదార తీసుకుని అందులో ఒక టీస్పూన్‌ పెట్రోలియం జెల్లీ కలిపి.. మిశ్రమంతో మసాజ్‌ చేస్తే పెదవులు పగలవు. పెదవులు మృదువుగా తయారవుతాయి. బయటకు వెళ్లేటప్పుడు సూర్య కిరణాల నుంచి మీ పెదవుల్ని కాపాడుకోవడానికి సన్‌ క్రీమ్‌గానీ పెట్రోలియం జెల్లీని గానీ క్రమం తప్పకుండా పెదవులపై రాసుకోవాలి. ఇంట్లోనే ఉంటే కోకో బటర్‌ని రాసుకుంటే పెదవులు గులాబి రంగులో కనిపిస్తాయి.