టమోటా జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు కలిపి..?
ఇప్పటి కాలంలో మహిళలు అన్నీ రంగాల్లో ధీటుగా రాణిస్తున్నారు. పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం మహిళలు వ్యక్తిగత వికాసంతో పాటు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రతిరోజూ తమ అందాన్ని మెరుగు పరుచుకునేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు.
ముఖ్యంగా కంటి అందంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ ప్రతిరోజూ కంప్యూటర్ల ముందు కూర్చునే మహిళలకు కంటి కింద చారలు వచ్చేస్తున్నాయి. అలా మీ కంటికి కింద చారలున్నట్లైతే ఈ కథనాన్ని చదవాల్సిందే.
రాత్రివేళ నిద్రలేకున్నా, అతిగా పనిచేసినా ఆ అలసట ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఆ విషయాన్ని కళ్ల కింద ఏర్పడే నల్లని చారలు స్పష్టం చేస్తాయి. ఆ నల్లటి చారలు పోవాలంటే పుదీనా ఆకులను బాగా చిదిమి కంటి కింద రాసుకుంటే చల్లగా ఉంటుంది.
ఇలా చేయడం వలన అలసట తగ్గిపోతుంది. అదేవిధంగా నాలుగైదు బాదం పప్పుల్ని నానబెట్టి మెత్తగా నూరి దానికి తాజా పాలను కొద్దిగా కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి 10 నుంచి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.
అదేవిధంగా ఒక గ్లాస్ టమోటా జ్యూస్‌లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి, దానిపై పుదీనా ఆకులు చల్లి రోజుకు రెండుసార్లు తాగితే కంటి కింద నల్ల చారలు మాయమవుతాయని బ్యూటీషన్లు చెబుతున్నారు.