మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 జనవరి 2019 (21:17 IST)

శీతాకాలంలో శిరోజాల సంరక్షణ ఎలా?

చలికాలంలో ప్రతి ఒక్కరికి  జుట్టు చిట్లిపోవడం, ఊడిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య పరిష్కారానికి అనేక రకములైన నూనెలను వాడుతుంటాము. ఇవి కనుక మనకు సరిపడకపోతే సమస్య ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యనుండి తప్పించుకోవాలంటే సులువైన ఈ క్రింద చిట్కాలను పాటించండి.
 
1. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి.
 
2. చలికాలంలో తలస్నానం చేసిన తర్వాత శిరోజాలకు డ్రయర్‌లను వాడకూడదు. మెత్తని తువాలుతో తుడుచుకుని గాలికి ఆరనివ్వాలి.
 
3. తలకు నూనె పట్టించేవారు ఈ కాలంలో ఎక్కువసేపు నూనెను అలాగే ఉంచుకోకూడదు.
 
4. వారంలో కనీసం రెండుసార్లు ఆలివ్ ఆయిల్ పట్టించడం వలన శిరోజాలు సమృద్ధిగా పెరుగుతాయి. 
 
5. అలోవెరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి.
 
6. ప్రతిరోజూ కండీషనర్ తప్పనిసరిగా వాడాలి. ఒకసారి జుట్టుకు మాయిశ్చరైజర్లు వాడిన తర్వాతా చల్లని నీళ్లలో జుట్టును తడిపితే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అంతేకాక జుట్టును మరింత కాంతివంతంగా చేస్తుంది.