శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (12:20 IST)

దానిమ్మతో చర్మానికి మేలెంత?

దానిమ్మ పండులో ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. దానిమ్మలో వుండే పాలీఫినాల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు.. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మంపై ఏర్పడే మచ్చలను తగ్గించుటకు, దానిమ్మ గింజల

దానిమ్మ పండులో ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. దానిమ్మలో వుండే పాలీఫినాల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు.. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మంపై ఏర్పడే మచ్చలను తగ్గించుటకు, దానిమ్మ గింజల నుండి తయారు చేసిన నూనెలను వాడటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. 
 
సూర్యకాంతి వల్ల చర్మానికి దానిమ్మ మేలు చేస్తుంది. ఎల్లాజిక్ యాసిడ్, పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మలో పుష్కలంగా వుంటాయి. దానిమ్మ గింజలు చర్మంలో ఏర్పడే, క్యాన్సర్ ట్యూమర్ ఏర్పాటును అడ్డుకుంటాయి. 
 
దానిమ్మ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దానిమ్మ పండులో ఉండే ప్యూనిక్ యాసిడ్, చర్మ కణాలలో ఉండే బ్యాక్టీరియా, టాక్సిన్లను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుంది. దానిమ్మ పండు జ్యూస్‌ను పొడి చర్మానికే జిడ్డు చర్మానికి కూడా మేలు చేస్తుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్ళను, మచ్చలను దానిమ్మ తగ్గించి వేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
దానిమ్మ గింజల రసం నాలుగు స్పూన్లు, మూడు స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. అలాగే దానిమ్మ గింజల పేస్టుకు ఒక స్పూన్ తేనెను కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.. 30 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం సౌందర్యవంతంగా తయారవుతుందని.. వారానికి రెండ లేదా మూడు సార్లు ఇలా చేస్తే చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయి.