అందంగా కనిపించాలంటే... మధ్యాహ్నం అర్థగంటే నిద్రపోవాలి!
అందంగా కనిపించాలంటే పగటి పూట నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందంగా ఉండాలని, బరువు పెరగకూడదనుకుంటే మధ్యాహ్నం పూట గంటల పాటు నిద్రపోకుండా అరగంట మాత్రమే నిద్రపోవాలి. ఇంకా అందంగా కనిపించాలనుకునే నిద్ర విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వయసును బట్టి ఫేస్‌ప్యాక్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. తలస్నానం చేయడానికి ముందుగా ఆయిల్‌తో బాగా మసాజ్ చేసుకోవాలి, నిమ్మరసం పెరుగు శెనగపిండి కలిపి శరీరానికి మర్దన చేసి స్నానం చేయండి. అందానికి అదనపు పాయింట్ కేశసౌందర్యం. అందుచేత గోరువెచ్చని నూనెను తలకు పట్టించి వేడినీటిలో ముంచి తీసిన టవల్‌ను నెత్తికి చుట్టుకోవాలి. ఇలాచేసినట్లైతే రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
అందానికి మరింత అందాన్నిచ్చేవి దుస్తులు. మీ శరీరలావణ్యం ఎత్తు లావును బట్టి అందరికీ నచ్చే డ్రెస్‌ను ఎంపిక చేసుకోండి. ఇక అందానికి నవ్వు వెలకట్టలేని ఆభరణం. కోపం వదిలేసి అందరితో కలిసిపోయేలా చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించాలి. ఇలాచేస్తే మీరు ఇతరులకు అందంగా కనిపిస్తారు.