1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated: మంగళవారం, 12 జూన్ 2018 (09:30 IST)

శరీర లావణ్యాన్ని పసుపు తీసుకుంటే....

పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటారు. ఎన్నో వ్యాధులకు మందులుగా కూడా ఉపయోగిస్తారు. మహిళలు స్నానం చేసే సమయంలో ముఖానికి కూడా రాసుకుని స్నానం చేస్తుంటారు. అలాంటి పసుపు శరీరా లావణ్యాన్ని కూడా పెంచేందుకు సహా

పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటారు. ఎన్నో వ్యాధులకు మందులుగా కూడా ఉపయోగిస్తారు. మహిళలు స్నానం చేసే సమయంలో ముఖానికి కూడా రాసుకుని స్నానం చేస్తుంటారు. అలాంటి పసుపు శరీరా లావణ్యాన్ని కూడా పెంచేందుకు సహాయపడుతుంది. మరి ఆ చిట్కాలను తెలుసుకుందాం.
 
ప్రతిరోజూ ఉదయం స్నాసం చేయటానికి అరగంట ముందుగా పసుపు ఒంటికి బాగా రాసుకుని తరువాత స్నానె చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుటలో కూడా సహాయపడుతుంది. ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి వాటికి పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది.
 
పసుపు నీటిని వారానికి ఒకసారి త్రాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గించుటకు ఉపయోగపడుతుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ది పరుస్తుంది. ఆముదంలో కొద్దిగా పసుపు కలుపుకుని శరీరానికి రాసుకుని 10 నిమిషాల తరువాత సబ్బుతో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన శరీరంపై గల మచ్చలు, దురదలు, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి. 
 
శరీరం మదీ ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు లేదా వేపాకును నూరి చర్మానికి పట్టిస్తే దురద తగ్గిపోతుంది. ఇలా చేయడం మీ చర్మం మృదువుగా, కాంతివంతగా మారుతుంది.