మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (11:14 IST)

వాస్తు ప్రకారం వాహనాలను పార్కింగ్ ఎలా చేయాలంటే?

నానాటికి పెరిగిపోతున్న ఆధునిక నాగరికతకు అనుగుణంగా వాహనాల కొనుగోలు అధికం కావడంతో పాటు ప్రతి ఒక్కరూ, ద్విచక్ర వాహనాలు, కార్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వాహనాల్లో అప్పుడప్పుడు ఏవేవో లోపాలు ఏర్పడటం గమనిస్తుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు పార్కింగ్ స్థలాన్న

నానాటికి పెరిగిపోతున్న ఆధునిక నాగరికతకు అనుగుణంగా వాహనాల కొనుగోలు అధికం కావడంతో పాటు ప్రతి ఒక్కరూ, ద్విచక్ర వాహనాలు, కార్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వాహనాల్లో అప్పుడప్పుడు ఏవేవో లోపాలు ఏర్పడటం గమనిస్తుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు పార్కింగ్ స్థలాన్ని ఎన్నుకోవడం ద్వారా కూడా ఉద్భవిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. మరి దీని ప్రకారం పార్కింగ్ విధానంలో చేపట్టవలసిన అంశాలను చూద్దాం.
 
ఇంటికి ఉత్తరం, తూర్పు ప్రాంతాల్లో పార్కింగ్ దిక్కులుగా వాస్తు సూచిస్తోంది. ఇలా తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం వలన వాహనాల్లో ఏర్పడే సమస్యలను అరికట్టవచ్చని వాస్తు శాస్త్రజ్ఞులు తెలియజేశారు. ఇదేవిధంగా ఉత్తరం, తూర్పు దిశలో ఎక్కువ కాలం పాటు వాహనాలను నిలిపు ఉంచకూడదు. ఈ దిక్కులో వాహనాలను ఎక్కువగా కాలంపాటు నిలిపితే అప్పుడప్పుడు వాహనాల్లో లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. 
 
పాడయిన వాహనాలను తూర్పు, దక్షిమం, పశ్చిమ దిశలుగా నిలుపువచ్చును. తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయకూడదు. అంతేకాకుండా నూనె, గ్రీస్ వంటి వాహనాలకు సంబంధించిన నూనె పదార్థాలు ఈ దిక్కుల్లో ఉంచకూడదు. ఇంటికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో వాహనాలను నిలిపేందుకు షెడ్లను ఏర్పాటు చేయవచ్చును.