ఎస్.బి.ఐ నుంచి ఎం-క్యాష్ సేవలు నిలిపివేత
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్ బ్యాంకు ఈ నెల 30వ తేదీ నుంచి ఎం-క్యాష్ సేవలను పూర్తిగా నిలిపివేయనుంది. ఈ విషయాన్ని ఆ బ్యాంకు తాజాగా ప్రకటించింది. నగదు లావాలేదీలకు సురక్షితమైన విధానాలను ఎంచుకోవాలని తమ ఖాతాదారులకు సూచనచేసింది.
ప్రస్తుతం ఎస్.బి.ఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌లలో ఈ ఎం-క్యాష్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిద్వారా కస్టమర్లు లబ్దిదారుడి బ్యాంకు ఖాతాను ముందుగా నమోదు చేయకుండానే కేవలం వారి మొబైల్ నంబరు లేదా ఈ-మెయిల్ ఐడీ ఉపయోగించి డబ్బు పంపడం, స్వీకరించడం చేయొచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ నుంచి తొలగిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది.
ఎం-క్యాష్ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో కస్టమర్లు నగదు బదిలీ కోసం ఇతర సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ఉపయోగించుకోవాలని ఎస్.బి.ఐ సూచించింది. ఇందుకో ప్రత్యామ్నాయ మార్గాలైన యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి వాటిని ఉపయోగించుకోవాలని సూచించింది.