హోలీలో మునిగి తేలబోతున్న ఏపీ... బ్యాంకులకు 5 రోజులు శెలవులు...
మార్చి నెల అనగానే బ్యాంకులు గురించి అంతా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపు కనుక మార్చి నెలలో బ్యాంకు శెలవులు అధికంగా వుంటాయి. ఐతే ఈసారి మార్చి నెలలో 5 ఆదివారాల పోను రెండు శనివారాలు, రెండు రోజుల హోలీ శెలవు కావడంతో బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఖాతాదారులు ఈ శెలవులను దృష్టిలో పెట్టుకుని లావాదేవీలను ముందుగానే ముగించుకుంటే మంచిది.
తెలంగాణలో రాష్ట్రంలో మార్చి 9, మార్చి 21 హోలీ, మార్చి 23న 4వ శనివారం సందర్భంగా బ్యాంకులకు శెలవులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే హోలీ సందర్భంగా మార్చి 20, 21 రెండు రోజులు బ్యాంకులకు శెలవులు. కాబట్టి ఏపీలో హోలీ సంబరాలు పెద్దఎత్తున జరుగనున్నాయి.