శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (13:41 IST)

ఖాతాదారుల నుంచి రూ.10 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు

కస్టమర్ల ఖాతాల నుంచి బ్యాంకులు ఏకంగా రూ.10 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేదనీ, ఏటీఎం కార్డుల ద్వారా ఐదు కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేశారనీ ఇలాంటి సాకులతో ఏకంగా రూ.10 వేల కోట్లను అపరాధం రూపంలో వసూలు చేశాయి. ఈ మొత్తాన్ని గత మూడున్నరేళ్ళ కాలంలో లాగేశాయి. 
 
ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు చేసిన 10 వేల కోట్ల రూపాయల్లో ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోవటం వల్ల వసూలు చేసిన పెనాల్టీ 6,246 కోట్ల రూపాయలు కాగా, పరిమితికి మించి ఏటీఎంల ద్వారా ట్రాన్సాక్షన్ జరిపినందుకు వసూలు చేసిన మొత్తం 4,145 కోట్ల రూపాయలు. 
 
ఇందులో ఎస్బీఐ వాటా మినిమమ్ బ్యాలెన్స్ కుసంబంధించి 2,894 కోట్లు కాగా, ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి 1,554 కోట్లుగా ఉంది. నిజానికి ఎస్బీఐ 2012 సంవత్సరంలో ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఎత్తివేసింది. కానీ 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ నిబంధనను అమల్లోకి తెచ్చి అపరాధాన్ని వసూలు చేస్తున్నాయి.