1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (18:06 IST)

ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త.. ఏంటది?

ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని మీ పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. దీపావళి పండుగా సందర్భంగా అందరి ఖాతాలో జమ అవుతుందని భావించారు కానీ, కొంచెం ఆలస్యం అయ్యింది.
 
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది.
 
2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. ఆన్‌లైన్‌లో మీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవచ్చు. దీంతో వడ్డీ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు.