శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (06:55 IST)

డిసెంబర్ నెలాఖరు వరకు పాన్ - ఆధార్ అనుసంధానం

ఆదాయపన్ను శాఖ ఆదేశం మేరకు పాన్ కార్డుతో ఆధార్ నంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి వుంది. వాస్తవానికి ఈ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఈ గడువును ఆదాయం పన్ను శాఖ డిసెంబర్ 31 వరకు పొడిగించింది

ఆదాయపన్ను శాఖ ఆదేశం మేరకు పాన్ కార్డుతో ఆధార్ నంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి వుంది. వాస్తవానికి ఈ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఈ గడువును ఆదాయం పన్ను శాఖ డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇదివరకు విధించిన గడువు ముగియడంతో దానిని మరో నాలుగు నెలలు పొడిగించారు.
 
సంక్షేమ పథకాల ఆధార్ గడువు తరహాలోనే ఈ గడువునూ పొడిగించినట్టు గురువారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయంపన్ను నిబంధన 139 ఏఏ ప్రకారం ఆధార్ ఉన్నవారు/దరఖాస్తు చేసుకున్నవారు పాన్ నంబర్‌తో జతచేయాల్సి ఉంటుంది.