గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 జూన్ 2022 (23:00 IST)

తెలంగాణాలోని ఆదిలాబాద్‌లో తమ మొట్టమొదటి సమాచార కేంద్రంను ప్రారంభించిన ఆకాష్‌-బైజూస్‌

Adilabad IC launch
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేయాలనే లక్ష్యానికనుగుణంగా దేశంలో అగ్రగామి టెస్ట్‌  ప్రిపరేషన్‌ సేవల సంస్థ ఆకాష్‌-బైజూస్‌ నేడు ఆదిలాబాద్‌లో తమ మొట్టమొదటి సమాచార కేంద్రాన్ని 12-68/1, మొదటి అంతస్తు, శ్రీ బాలాజీ స్వీట్స్‌ పైన, తిరుమల పెట్రోల్‌ బంక్‌ వద్ద , ధోబీ కాలనీ, దాస్నాపూర్‌, ఆదిలాబాద్‌ వద్ద ప్రారంభించింది.

 
ఈ సమాచార కేంద్రం వద్ద ఆకాష్‌-బైజూస్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా అది అందించే కోర్సులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారమూ పొందవచ్చు. ఆకాష్‌-బైజూస్‌ వద్ద విద్యార్థులు ఇప్పుడు వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సులతో పాటుగా ఫౌండేషన్‌ స్థాయి కోర్సులను సైతం ఎంచుకోవచ్చు.

 
ఈ నూతన సమాచార కేంద్రాన్ని ఆకాష్‌-బైజూస్‌ చీఫ్‌ రెవిన్యూ ఆఫీసర్‌ శ్రీ నితిన్‌ గొలానీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ శేషగిరి రాజు ; ఏరియా బిజినెస్‌ హెడ్‌ పింకు ప్రసాద్‌; అకడమిక్‌ డైరెక్టర్‌ సుమన్‌ గౌడ్‌; బ్రాంచ్‌ హెడ్‌ వెంకటేష్‌ మెరుగుల పాల్గొన్నారు.

 
ఈ ప్రారంభం గురించి శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా, రీజనల్‌ డైరెక్టర్‌, ఆకాష్‌-బైజూస్‌ మాట్లాడుతూ ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలని ఆశిస్తోన్న స్థానిక విద్యార్థులకు ఆదిలాబాద్‌లోని ఈ కేంద్రం ఓ వరంగా మారనుందన్నారు. దేశవ్యాప్తంగా తమ నాణ్యమైన బోధన ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరువయ్యామంటూ ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్‌లకు ఎంపికైన తమ విద్యార్థులే దానికి నిదర్శనమన్నారు. ఆకాష్‌-బైజూస్‌లో చేరగోరు విద్యార్థులు ఇన్‌స్టెంట్‌ అడ్మిషన్‌ కమ్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (ఐఏసీఎస్‌టీ) లేదంటే ఆకాష్‌-బైజూస్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పరీక్షలలో పాల్గొనవచ్చు.