శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 మే 2023 (21:17 IST)

న్యూదిల్లీ లోని ఎయిమ్స్‌లో కొత్త సర్జికల్ రోబోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఎయిమ్స్, మెడ్ ట్రానిక్ భాగస్వామ్యం

photo
న్యూదిల్లీలోని ఎయిమ్స్‌‌లో అత్యాధునిక శస్త్రచికిత్స రోబోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎయిమ్స్ (న్యూదిల్లీ), మెడ్‌ట్రానిక్ పిఎల్‌సికి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఇండియా మెడ్‌ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించాయి. రోబోటిక్-సహాయక శస్త్ర చికిత్సలో అత్యుత్తమ శిక్షణ పొందిన సర్జన్లను ఈ కేంద్రం అందించనుంది. 2021 సెప్టెంబర్‌లో భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టబడిన మెడ్‌ట్రానిక్ హ్యూగో రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ (RAS) సిస్టమ్‌ ని ఉపయోగించే  కేంద్రాల్లో ఎయిమ్స్ లోనిది మొదటిది. కొత్త శిక్షణ భాగస్వామ్యాన్ని ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి, డీన్ అకాడెమిక్స్ డాక్టర్ మిను బాజ్‌పాయ్, మెడ్‌ట్రానిక్ ఇండి యా వైస్ ప్రెసిడెంట్- మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బ్లాక్‌వెల్ సమక్షంలో ప్రకటించారు. ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా సర్జన్‌లకు శిక్షణ ఇవ్వడానికి, RAS ప్రయోజనాలకు యాక్సెస్‌ను విస్తరించడా నికి కొత్త సాంకేతికత మరియు దశాబ్దాల శస్త్రచికిత్స నైపుణ్యాన్ని కల్పిస్తుంది.
 
RAS అనేది అభివృద్ధి చెందుతున్న వైద్య సాంకేతికత. ఇది శస్త్రచికిత్స విధానాలను ప్రామాణీకరించడంలో సహాయపడుతుంది. సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడంలో సర్జన్‌లకు వీలు కల్పిస్తుంది. ప్రాథమి క నైపుణ్యాల శిక్షణ నుండి విధానపరమైన శిక్షణ వరకు మృదు కణజాల శస్త్రచికిత్సలో మరింత అధునాతనమైన విధంగా, స్పెషలైజ్డ్ ఏరియాలలో RASలో విజ్ఞానం, నైపుణ్యాన్ని పెంపొందించడా నికి ఈ శిక్షణ కేంద్రం విస్తృతమైన శిక్షణను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సర్జన్లు, సర్జికల్ రోబో టిక్స్‌ ని ఉపయోగించి విధానపరమైన జ్ఞాన నైపుణ్యాలను పొందడంలో ఈ శిక్షణ సహాయపడుతుంది.
 
“ఎయిమ్స్‌‌తో మెడ్‌ట్రానిక్ భాగస్వామ్యం భారతదేశంలోని ఎక్కువ మంది రోగులకు RAS ప్రయోజ నాలను అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతకు మూలస్తంభం. కలిసికట్టుగా మేం తాజా సాంకేతికతపై శిక్షణ, విద్యను మరింత అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుత, తరువాతి తరం సర్జన్ల నైపు ణ్యాన్ని మెరుగుపరుస్తాం” అని మెడ్‌ట్రానిక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్-మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బ్లాక్‌వెల్ అన్నారు. "రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స అనేది సంప్రదాయిక పద్ధతులతో సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ కచ్చితత్వం, సరళత్వం, నియంత్రణతో సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సర్జన్లకు వీలు కల్పి స్తుంది.


సర్జికల్ రోబోలు చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల వాటి విని యోగం పరిమితం చేయబడింది, వాటిలో శిక్షణ ఒకటి. సర్జికల్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్ ఇప్పటికే సర్జికల్ కేర్ డెలివరీ విధానాన్ని మారుస్తున్నాయి. ఈ కార్యక్రమం శస్త్రచికిత్సలు ఓపె న్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీ నుండి అధునాతన RASకి పురోగమించటానికి మార్గం సుగమం చేస్తుంది. రోబోటిక్ టెక్నిక్‌లలో నైపుణ్యం సాధించడానికి వారి అభ్యాస సమయాన్ని తగ్గిస్తుంది" అని ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి, డీన్ అకడమిక్స్ డాక్టర్ మిను బాజ్‌ పాయ్ అన్నారు.