అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇప్పుడు అలెక్సాలో ప్రత్యక్షంగా వినొచ్చు
అమెజాన్ నేడు తమ అలెక్సాపై భారతదేశంలో మొట్టమొదటి సారిగా సెలబ్రిటీ గొంతు అనుభవాలను పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా వెల్లడించింది. భారతీయ సినిమాలో లెజండరీ నటునిగా గుర్తింపు పొందిన శ్రీ అమితాబ్ బచ్చన్ గొంతును ఇప్పుడు వినియోగదారులు ఎంచుకోవచ్చు. తమ ఎకో ఉపకరణాలపై అలెక్సా అనుభవాలను పొందుతూ అమితాబ్ వాయిస్‌ను జోడించుకోవడానికి అమెజాన్ షాపింగ్ యాప్‌పై మైక్ ఐకాన్ నొక్కాల్సి ఉంటుంది (ఆండ్రాయిడ్‌లో మాత్రమే). దీని కోసం సంవత్సరానికి 149 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సెలబ్రిటీ ఎక్స్‌పీరియన్స్‌లో శ్రీ అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా ఎంపిక చేసిన కంటెంట్ అనుభవాలను పొందవచ్చు. దీనిలో ఆయన జీవితపు కథలు, ఆయన తండ్రి రచించిన పద్యాలలో ఎంపిక చేసిన ఆణిముత్యాలు, స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు మరియు మరెన్నో ఉంటాయి. వీటితో పాటుగా వినోదాత్మక కంటెంట్ కూడా ఆస్వాదించవచ్చు. సింపుల్‌గా అమిత్‌జీ, ప్లే సాంగ్స్ ఫ్రమ్ కభీ కభీ లేదంటే అమిత్‌జీ, షోలే కే గానే బజాయే లేదా సింపుల్‌గా, అమిత్‌జీ, టెల్ మీ ఏ ఫన్నీ స్టోరీ అని అడగడం ద్వారా తెరవెనుక కథలను కూడా వినొచ్చు.
అలెక్సాపై నా గొంతును పరిచయం చేయడం కోసం అమెజాన్‌తో కలిసి పనిచేయడం వినూత్న అనుభవాలను అందించింది.ఈ నూతన మాధ్యమం ద్వారా నా శ్రేయోభిలాషులు నాతో మాట్లాడవచ్చు అని అమితాబ్ బచ్చన్ అన్నారు.
అమెజాన్ మరియు అలెక్సా వద్ద మేము స్ధిరంగా మా వినియోగదారుల కోసం ఆవిష్కరణలను చేయడంతో పాటుగా అమితాబ్ బచ్చన్ గొంతు అనుభవాలను అందిస్తున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ద్వి భాషా సెలబ్రిటీ గొంతు అనుభవాలను సృష్టించడం కోసం స్పీచ్ సైన్స్‌ను మేము దాదాపుగా పునరావిష్కరించాల్సి వచ్చింది అని పునీష్ కుమార్, కంట్రీ లీడర్ ఫర్ అలెక్సా, అమెజాన్ ఇండియా అన్నారు.