శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (15:34 IST)

సరికొత్త లుక్‌లో మారుతి ఆల్టో కె10 : ధర రూ.3.99 లక్షలే

alto k10
దేశంలో ప్రముఖ కార్ల ఉత్పత్తి కంపెనీగా ఉన్న మారుతి కంపెనీ తాజాగా సరికొత్త కారును ప్రవేశపెట్టింది. మారుతి ఆల్టో కె10 పేరుతో సరికొత్త లుక్‌లో ఆవిష్కరించింది. ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ ధర రూ.3.900 లక్షలు. రూ.11 వేలు చెల్లించి తక్షణం బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. మొత్తం ఏడు వేరియంట్లలో ఈ కారును అందుబాటులోకి తెచ్చింది. కారు లోపల, బయటా పలు మార్పులు చేసింది. 
 
ఈ ఏడు రకాల భిన్న వేరియంట్లను పరిశీలిస్తే, స్టాండర్డ్, ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ(వో), వీఎక్స్ఐ), వీఎక్స్ఐ(వో), వీఎక్స్ ప్లస్, వీఎక్స్ఐ ప్లస్ (వో) వేరియంట్లను ఫీచర్ల ప్రకారం కస్టమర్లు తమకు నచ్చింది ఎంచుకోవచ్చు. 
 
ఈ వేరియంట్లలో గరిష్ట ధర రూ.5.83 లక్షలు కాగా, ఇది ఆరు రంగుల్లో లభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్టో కే10తో పోలిస్తే కొత్త మోడల్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. ముందుభాగంలో గ్రిల్ ఎక్కువగా కవర్ అయి ఉంటుంది. హెడ్ ల్యాంప్‌లు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. క్యాబిన్‌లోనూ ఎన్నో మార్పులు చేశారు. 
 
డ్యాష్ బోర్డు మొత్తం ఆల్ బ్లాక్ థీమ్‌తో వస్తుంది. సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక లీటర్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ ఇంజన్‌తోనే ఆల్టో కే10ను ఆఫర్ చేస్తోంది. తర్వాత సీఎన్ జీ వెర్షన్ కూడా తీసుకురానుంది. లీటర్‌కు 24.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ అంటోంది. కారులోని నాలుగు డోర్లకు స్పీకర్లు ఏర్పాటు చేశారు. రెండు ఎయిర్ బ్యాగ్‌లతో ఇది వస్తుంది. రియర్ పార్కింగ్ అసిస్టెన్స్ కూడా ఉంది.