1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

covid19
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత మంగళవారం 8 వేలకు తగ్గిన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం 12 వేలుగా నమోదయ్యాయి. శుక్రవారం ఈ కేసుల సంఖ్య 15,754కు చేరాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి చేరగా, ఇందులో 4,36,85,535 మందికి బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,253 మంది కరోనా వైరస్‌కు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,01,830 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
గత 24 గంటల్లో 47 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతి చెందగా, 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసుల యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం మరణాలు, 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 209.27 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.