బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (17:18 IST)

యూజర్లకు షాక్... అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రుసుం పెంపు

Amazon
దేశంలోని ప్రముఖ ఓటీటీ సంస్థల్లో అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు షాకిచ్చింది. నెలవారీ సబ్ స్క్రిప్షన్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలవారీ, త్రైమాసిక ప్లాన్ల ధరను పెంచాయి. ముఖ్యంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఏకంగా 67 సాతం పెంచగా, త్రైమాసిక ప్లాన్‌ సైతం సవరించింది. వార్షిక ప్లాన్‌లో మాత్రం ఎంటువంటి మార్పు చేయలేదు. తక్షణమే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే సబ్‌స్క్రైమబ్ అయిన వారికి 2024 జనవరి 15వ తేదీ వరకు పాత రేట్లే వర్తిస్తాయి. ఏదైనా కారణంతో రెన్యువల్ ఫెయిల్ అయితే మాత్రం కొత్త ప్లాన్ల కింద ధరను చెల్లించాల్సివుంటుంది. 
 
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ నెలవారీ చందా ఇప్పటివరకు రూ.179గా ఉండేది. దీన్ని తాజాగా రూ.299కి పెంచుతున్నట్టు అమెజాన్ తెలిపింది. అలాగే, మూడు నెలల చందా రూ.459 నుంచి రూ.599కి పెంచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.1449గా ఉండగా, అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు, వార్షిక సబ్ స్క్రిప్షన్ ధను కూడా రూ.999గా పెంచింది. ఇందులో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉండే అన్ని సదుపాయాలూ ఉంటాయి. కాకపోతే ప్రైమ్ వీడియో కంటెంట్‌ను ఎస్.డి క్వాలిటీలో చూడటానికి వీలుంటుంది. ప్రకటనలు కూడా ఉంటాయి.