శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (15:12 IST)

రూ.200 నోటుకు మరో రెండునెలలు ఆగాల్సిందే...

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద నోట్లను రద్దు చేశారు. ముఖ్యంగా రూ.1000 నోటు రద్దు చేసి రూ.2 వేల నోటును విడుదల చేశారు. దీంతో చిల్లర సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఈ సమస్యకు పర

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద నోట్లను రద్దు చేశారు. ముఖ్యంగా రూ.1000 నోటు రద్దు చేసి రూ.2 వేల నోటును విడుదల చేశారు. దీంతో చిల్లర సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా భారత రిజర్వు బ్యాంకు రూ.200 నోటును కొత్తగా ప్రవేశపెట్టింది.
 
ప్రస్తుతం ఈ నోటును బ్యాంకుల ద్వారానే అందిస్తున్నారు. అయితే ఈ నోట్లు ఏటీఎంల ద్వారా తీసుకోవాలంటే మరికొద్ది నెలలు ఆగాల్సిందే. డిసెంబర్‌ చివరి నాటికి రూ.200 నోట్లను ఏటీఎంల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.
 
ఏటీఎంలలోని సాఫ్ట్‌వేర్‌ను మార్చడం అంటే సులువైన పనికాదు. అది చాలా కష్టంతో కూడుకున్నది. కొత్త నోట్లకు తగ్గట్లుగా ఏటీఎంల అమరికను మార్చాలంటే అది చాలా సమయంతో కూడుకున్న ప్రక్రియ. కొంత సమయం తీసుకుని 200 నోటుకు అనుగుణంగా ఏటీఎంల అమరికను డిసెంబర్ చివరినాటికి మార్చనున్నట్లు తెలుస్తోంది.