మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2023 (15:35 IST)

రైల్వే ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ చేయడానికి బంధన్ బ్యాంక్‌కు ఆర్బీఐ అనుమతి

cash notes
భారతదేశ వ్యాప్తంగా యూనివర్సల్ బ్యాంక్‌గా గుర్తింపు పొందిన బంధన్ బ్యాంక్, ఇండియన్ రైల్వే తరపున e-PPOల ద్వారా పెన్షన్‌ను పంపిణీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)చే ధ్రువీకరణ పొందినట్లు ఈరోజు వెల్లడించింది. దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులతో భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ సంస్థగా ఉంది. పెన్షన్ పంపిణీ ప్రక్రియను అమలు చేయడానికి బ్యాంక్ త్వరలో రైల్వే మంత్రిత్వ శాఖతో కలువనుంది.
 
పదవీ విరమణ చేసిన దాదాపు 15 లక్షల మంది భారతీయ రైల్వే పెన్షనర్లకు పెన్షన్‌ను పంపిణీ చేయడానికి బంధన్ బ్యాంక్‌కు ఈ అధికారం వీలు కల్పిస్తుంది. ఈ ఆదేశం 17 జోనల్ రైల్వేలు, భారతీయ రైల్వే యొక్క 8 ఉత్పత్తి యూనిట్లతో సహా అన్ని కార్యాలయాలలో ప్రతి సంవత్సరం 50,000 సగటు భారతీయ రైల్వే రిటైర్ ఉద్యోగులకు సేవ చేయడానికి బ్యాంక్‌కు అవకాశాన్ని అందిస్తుంది.
 
ఇది బంధన్ బ్యాంక్ యొక్క ప్రస్తుత, కొత్త కస్టమర్లకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సేవలు, సరసమైన వడ్డీ రేట్లతో పాటు బ్యాంక్ అందించే సీనియర్ సిటిజన్ ప్రత్యేక సైతం పొందే అవకాశాన్ని అందిస్తుంది. పెన్షనర్లు 1640 కంటే ఎక్కువ బ్రాంచ్‌లకు యాక్సెస్‌ను పొందుతారు. బంధన్ బ్యాంక్ యొక్క అత్యున్నత  డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ సేవలను సైతం ఉత్తమంగా పొందుతారు. 
 
బంధన్ బ్యాంక్ గవర్నమెంట్ బిజినెస్ హెడ్ దేబ్రాజ్ సాహా మాట్లాడుతూ, “భారతీయ రైల్వేలు దేశంలో ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద ఉద్యోగ సంస్థలలో ఒకటి. రైల్వేలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ను పంపిణీ చేసే అధికారం, బ్యాంకు యొక్క ఉత్తమ ఉత్పత్తులు, సేవలతో వారికి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు బంధన్ బ్యాంక్ అందించే అత్యంత పోటీ రేట్లను ఆస్వాదించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రైల్వేలు మరియు ఆర్బీఐ చేసిన ఈ ఆదేశం మా బ్యాంక్‌పై నియంత్రణాధికారులు, ప్రభుత్వం ఉంచిన విశ్వాసం మరియు నమ్మకానికి నిదర్శనం. 
 
ఈ కొత్త ఆథరైజేషన్, భారతీయ రైల్వేలో పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్‌లను సమర్ధవంతంగా పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించడానికి అనుమతిస్తుంది, వారి గోల్డెన్ సంవత్సరాల్లో వారి ఆర్థిక శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. మేము ఇప్పుడు పదవీ విరమణ చేసిన వారికి మరింత క్రమబద్ధీకరించిన, సురక్షితమైన, సత్వర పద్ధతిలో సేవలందించేందుకు మెరుగైన రీతిలో సన్నద్ధమయ్యాము." అని అన్నారు.