శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 జనవరి 2024 (19:56 IST)

నెల్లూరులో ఎక్స్ క్లూజివ్ షోరూం ప్రారంభించిన బెనెల్లి కీవే

Benelli Keeway
తమ ప్రత్యేకమైన మోడల్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బెనల్లీ కీవే ఇండియా నెల్లూరులో తన సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించింది. నెల్లూరు ఈ షోరూం... మెడికవర్ హాస్పిటల్, సర్వే నెంబర్ 932/A, అయోధ్యా నగర్ ఎక్స్ టెన్షన్, నేషనల్ హైవే 16, పినాకినీ అవెన్యూ, నెల్లూరు అడ్రెస్‌లో ఉంటుంది. ఈ బ్రాండ్ న్యూ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ గ్యాలరీ ఫెసిలిటీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా నెల్లూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో సేల్స్, సర్వీసు సేవలు అందించేందుకు ఇక్కడ షోరూమ్ ని ఏర్పాటు చేసింది బెనెల్లీ కీవే.
 
హరీష్ గ్రూప్ బ్యానర్ క్రింద ఈ షోరూమ్ ని నెల్లూరు లో శ్రీ హరీష్ రావు గారు ప్రారంభించారు. ఆయన బెనెల్లీ కీవే నెల్లూరుకు ప్రిన్సిపల్ డీలర్. ఈ కొత్త అవుట్‌లెట్‌తో, బెనెల్లీ కీవే ఇండియా భారతదేశంలో 59 షోరూమ్ లతో బలమైన నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రారంభించిన బెనెల్లీ ఈ షోరూమ్‌లో సూపర్ బైక్‌ల రేంజ్ నుంచి రీసెంట్‌గా ప్రారంభించిన హంగేరియన్ మార్క్ కీవే వరకు అన్ని ఉత్పత్తులు ఉంటాయి. షోరూమ్ లో జెన్యూన్ మెర్చండిస్ మరియు యాక్సిసరిస్ అందుబాటులో ఉంటాయి.
 
ఈ సందర్భంగా బెనెల్లీ కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వికాస్ జబఖ్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “భారతదేశం అంతటా ఉన్న మా వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు మేము మా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ ను వేగంగా విస్తరిస్తున్నాము. ఈ విస్తరణ బెనెల్లీ మరియు కీవే వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ల నుండి క్లాస్-లీడింగ్ సూపర్‌బైక్‌లను అందించడమే కాకుండా సాటిలేని కస్టమర్ సర్వీస్‌ను కూడా ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. మేము హరీష్ గ్రూప్‌తో భాగస్వామిగా అయినందుకు సంతోషిస్తున్నాము. వీరి ద్వారా బ్రాండ్‌కు పేరుగాంచిన క్లాస్-లీడింగ్ కస్టమర్ సర్వీస్‌ను అందించగలమని మేము విశ్వసిస్తున్నాము. ప్రత్యేకించి కస్టమర్-షోరూమ్ కి వచ్చినప్పుడు మొదటి మనం ప్రవర్తించే విధానమే వారికి కంపెనపై నమ్మకం పెరిగేలా చేస్తుంది అని అన్నారు ఆయన.
 
ఈ సందర్భంగా బెనెల్లీ కీవే- నెల్లూరు ప్రిన్సిపల్ డీలర్ శ్రీ హరీష్ రావు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “మేము బెనెల్లీ కీవే ఇండియాతో అసోసియేట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మా కస్టమర్-ఆధారిత విధానంతో, బెనెల్లీలో నిపుణులుగా మా కస్టమర్‌లందరికీ ఇబ్బంది లేని ప్రీమియం అమ్మకాలు మరియు సేవా అనుభవాన్ని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. నెల్లూరు అత్యుత్తమ యాజమాన్య అనుభవాన్ని అందించడానికి గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం కంపెనీచే శిక్షణ పొందింది అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం" అని అన్నారు ఆయన.