శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 22 జులై 2021 (23:25 IST)

దక్షిణాదిలో కొత్త డీలర్‍షిప్‍తో కస్టమర్ల సంఖ్యను పెంచుకున్న భారత్ బెంజ్

చెన్నై, దక్షిణ ప్రాంతంలో భారత్ బెంజ్ కమర్షియల్ వెహికల్స్ కోసం కొత్త టచ్ పాయింట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త డీలర్షిప్‍లు కర్ణాటకలో కోలార్ మరియు దావనగెరె, ఆంధ్రప్రదేశ్‍లో భీమవరం మరియు కేరళలో కాసరగోడ్‍లో ఉన్నాయి. తమిళనాడులోని తేని, తిరువారూరులలో భాగాలను పంపిణీ చేయడానికి DICV రెండు కొత్త అవుట్‍లెట్‍లను కూడా ప్రారంభించింది.
 
నిరంతర విస్తరణ భారతీయ మార్కెట్ మరియు భారత్ బెంజ్ సమాజం పట్ల DICV యొక్క దృఢ నిబద్ధతను ప్రదర్శిస్తుంది. కొత్త టచ్‍పాయింట్లు భారత్ బెంజ్ నెట్‍వర్క్ యొక్క నెలవారీ సర్వీస్ సామర్థ్యాన్ని సంవత్సరానికి 6000 జాబ్ కార్డులకు పెంచుతాయి.
 
VP మార్కెటింగ్, సేల్స్ మరియు కస్టమర్ సర్వీస్ అయిన శ్రీ రాజరామ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇలా అన్నారు, “కస్టమర్ సౌలభ్యాన్ని పెంచడం మరియు మా ఉత్పత్తులు మరియు సర్వీసుల ద్వారా అత్యాధునిక అనుభవాన్ని అందించడం మా లక్ష్యం. కస్టమర్లకు సర్వీసింగ్ సౌలభ్యం మరియు ప్రాప్యతను నిర్ధారించడానికి, డీలర్షిప్‍ల మధ్య దూరాన్ని తగ్గించడం మా లక్ష్యం. మేము తెరిచిన కొత్త డీలర్షిప్‍లు మా కస్టమర్లకు మా నిబద్ధతను మరియు దక్షిణ CV మార్కెట్ వృద్ధిపై విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తాయి.”
 
ఆన్-గ్రౌండ్ టచ్‍పాయింట్లు అనేవి భారత్ బెంజ్ యొక్క వృద్ధి పథంలో అంతర్భాగంగా ఉండి దృష్టి కేంద్రీకరణ ప్రాంతంగా కొనసాగుతాయి.  గత సంవత్సరం, DICV ఒకే రోజులో 10 టచ్ పాయింట్లను మరియు 2022 ముగింపు నాటికి 350 డీలర్షిప్‍లను కలిగి ఉండాలనే తమ ప్రణాళికను ప్రకటించింది.
 
2020 లో కఠినమైన పరిస్థితులలో కూడా మార్కెట్‍ను కంపెనీ అధిగమించగలిగేందుకు వీలుగా, భారత్ బెంజ్ ట్రక్కులు అందించే విలువ అనేది బ్రాండ్ పై పెరుగుతున్న కస్టమర్ల విశ్వాసం ద్వారా ధృవీకరించబడింది. భారత్ బెంజ్ ప్రస్తుతం తన కస్టమర్లకు వార్షిక మెయిన్టెనెన్స్ కాంట్రాక్ట్‍లు మరియు పొడిగించబడిన వారెంటీలపై మూడు నెలల వరకు ఉచిత పొడిగింపులను అందిస్తోంది.