సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 3 మార్చి 2021 (16:36 IST)

మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలో తనైరా చీరల ప్రదర్శన, విక్రయాలు

మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను వేడుక చేయడంతో పాటుగా వారిని గౌరవించడంలో భాగంగా టైటాన్‌కు చెందిన అతి పిన్నవయసు కలిగిన బ్రాండ్‌, తనైరా 05 మార్చి నుంచి 09 మార్చి 2021వ తేదీ (శుక్రవారం నుంచి మంగళవారం వరకూ) ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన చీరలతో ఓ ప్రదర్శన మరియు అమ్మకంను తనిష్క్‌ షోరూమ్‌, 238, ప్రకాశం రోడ్‌, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌ 517 501 వద్ద చేయనుంది. ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు తనైరా యొక్క ప్రత్యేకమైన కలెక్షన్‌ను వీక్షించవచ్చు. వీటిలో చందేరీ, మహేశ్వరి, బెంగాల్‌, భగల్‌పూర్‌, కాంజీవరం, దక్షిణ మరియు భారతదేశంలోని పలు ప్రాంతాలలో చేతితో రూపొందించిన చీరల కలెక్షన్‌ను వీక్షించవచ్చు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 30% వరకూ రాయితీని సైతం ఈ బ్రాండ్‌ అందిస్తుంది.
 
తిరుపతి ప్రదర్శన గురించి శ్రీమతి రాజేశ్వరి శ్రీనివాసన్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, తనైరా మాట్లాడుతూ, ‘‘మహిళా దినోత్సవాన్ని వేడుక చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అత్యంత అందమైన నగరం తిరుపతికి మా పాపప్‌ ప్రదర్శనను తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. టస్సర్‌, బెనారసీ మొదలు ఇకత్‌, చందేరీ తో పాటుగా మా ప్రత్యేకమైన బ్రైడల్‌ డిజైన్స్‌తో కూడిన పండుగ శ్రేణిని ఈ ఎగ్జిబిషన్‌తో తీసుకురానున్నాం. భారతదేశ వ్యాప్తంగా పలు  ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ఈ కలెక్షన్‌తో పాటుగా మా అంతర్గత డిజైన్లకు వివేకవంతులైన ఇక్కడి మహిళల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుందనే విశ్వాసంతో ఉన్నాం’’ అని అన్నారు.
 
తిరుపతిలో విస్తృతశ్రేణి కలెక్షన్స్‌ను తనైరా ప్రదర్శిస్తుంది. వీటిలో తనైరా యొక్క నూతన జోడింపులో ముగ్గురు దేవతలు- దుర్గ, లక్ష్మి, సరస్వతి యొక్క సాంస్కృతిక, డిజైన్‌ అంశాల స్ఫూర్తితో ప్రత్యేకమైన చీరల కలెక్షన్‌ ‘తస్వి’ సైతం ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో లినెన్‌ యొక్క విలాసవంతమైన కలెక్షన్‌ ‘ఫ్లోరెల్లీ’ సైతం ప్రదర్శిస్తారు. అలాగే పేస్టల్‌ టోన్స్‌ డ్రీమీ సిల్‌హ్యుటీలతో సిల్క్‌ శారీలు సైతం ప్రదర్శిస్తారు.
 
ఈ ఎగ్జిబిషన్‌లో బ్రైడల్‌ మరియు వెడ్డింగ్‌ కలెక్షన్స్‌ను బనారస్‌, కాంచీపురం నుంచి అతి సున్నితమైన సిల్క్స్‌తో తీర్చిదిద్దినవి కూడా ప్రదర్శిస్తారు. వీటితో పాటుగా తనైరా యొక్క రెడీ టు వేర్‌ శ్రేణి; లినెన్స్‌, టస్సర్స్‌ మరియు సాఫ్ట్‌ సిల్క్‌ ఇకత్స్‌తో తయారుచేసిన ఆకర్షణీయమైన కుర్తా సెట్స్‌, ఐరా, డ్రెస్‌ మెటీరియల్స్‌, రెడీ టు వేర్‌ బ్లౌజ్‌లు, మాస్క్‌లు, స్టోల్స్‌ మరియు దుపట్టలను సైతం ప్రదర్శిస్తారు.
 
ఆరంభమైన నాటి నుంచి తనైరా విజయవంతంగా దేశవ్యాప్తంగా 14 స్టోర్లను ప్రారంభించింది. బెంగళూరులో ఐదు స్టోర్లు- ఇందిరా నగర్‌, జయనగర్‌, కమర్షియల్‌ స్ట్రీట్‌, ఒరియన్‌ మాల్‌ మరియు ఫోనిక్స్‌ మార్కెట్‌ సిటీ మాల్‌లలో నిర్వహిస్తుంది. ఢిల్లీలో ఈ బ్రాండ్‌ మూడు స్టోర్లను సౌత్‌ ఎక్స్‌, యాంబియన్స్‌ మాల్‌, వసంత్‌ కుంజ్‌ మరియు ద్వారక; హైదరాబాద్‌లో ఒక స్టోర్‌, పూనెలో ఔంధ్‌ వద్ద మరోటి నిర్వహిస్తుంది. ఈ బ్రాండ్‌ మూడు స్టోర్లను ముంబైలోని ఘట్కోపర్‌, ఇనార్బిట్‌ మాల్‌ వాషి మరియు ఇటీవలనే బాంద్రాలో టర్నర్‌ రోడ్‌ వద్ద నిర్వహిస్తుంది. ఈ బ్రాండ్‌ మెరుగైన షాపింగ్‌ అనుభవాలను అందించడంతో పాటుగా పూర్తి స్ధాయిలోని స్టైల్‌ స్టూడియోను నిర్వహిస్తుంది. దీనిలో రెడీ టు వేర్‌ బ్లౌజులు, కస్టమైజేషన్‌ మరియు టైలరింగ్‌ సేవలు వంటివి మీ షాపింగ్‌ను పరిపూర్ణం చేస్తాయి.