సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (19:52 IST)

చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో ధర రూ.700కి పెంపు

chicken
చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తాజాగా మరోసారి చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బాయిలర్ చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. వేసవి తీవ్రత పెరగడంతో కోళ్లు చనిపోవడంతో పాటు.. వాటి మేతకు అయ్యే ఖర్చుకు పెరగడంతో చికెన్ ధరలు పెరిగిపోయాయి. 
 
నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 ఉండగా.. ఇప్పుడు ఆ ధర రూ.350కి పెరిగింది. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. కిలో చికెన్ ధర రూ.350కి చేరగా, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.700కి పెరిగింది. ఇక ఆదివారం ఈ రేట్లు ఇంకాస్త పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.