ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (13:07 IST)

వేదికపైనే భరతనాట్య గురువు శ్రీ గణేశన్ కన్నుమూత

Bharatanatyam Dance Guru
Bharatanatyam Dance Guru
మలేషియాకు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీ గణేశన్ శుక్రవారం సాయంత్రం ఒడిశా రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపైనే మరణించారు. మరణించేనాటికి ఆయన వయస్సు 60 ఏళ్లు.
 
వివరాల్లోకి వెళితే, నేషనల్ కల్చరల్ మిషన్ నిర్వహించిన మూడు రోజుల జయదేవ్ సమరోహానికి హాజరయ్యేందుకు గణేశన్ నగరానికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం గీత గోవిందం ఆధారంగా ఒక భాగాన్ని ప్రదర్శించిన అతను దీపం వెలిగిస్తూనే కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
 
గణేశన్ మలేషియా భరతనాట్యం డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కౌలాలంపూర్‌లోని శ్రీ గణేశాలయ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.