గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (18:51 IST)

భారతీయ పర్యాటకుల కోసం ఐదేళ్ల బహుళ-ప్రవేశ వీసాను ప్రకటించిన దుబాయ్

Dubai
దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, జనవరి- డిసెంబర్ 2023 మధ్య భారతదేశం నుండి 2.46 మిలియన్ల ఓవర్‌నైట్ సందర్శకులను దుబాయ్ స్వాగతించింది. ఇది కోవిడ్ మహమ్మారి పూర్వ కాలంతో పోల్చితే చెప్పుకోదగిన 25% వృద్ధిని ప్రదర్శిస్తుంది. అసాధారణమైన 34% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధితో, ఇండియా నుండి పర్యాటకులు దుబాయ్ సందర్శించారు. 
 
భారతదేశం- దుబాయ్ మధ్య ప్రయాణాన్ని మరింత విస్తృతం చేయడానికి ఐదు సంవత్సరాల బహుళ-ప్రవేశ వీసాను దుబాయ్ పరిచయం చేసింది. ఇది నిరంతర ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటక, వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడానికి దాని నిబద్ధతను నొక్కి చెబుతుంది. సేవా అభ్యర్థనను స్వీకరించి, అంగీకరించిన తర్వాత రెండు నుండి ఐదు పనిదినాలలోపు జారీ చేయబడిన వీసా, దాని హోల్డర్‌ని 90 రోజుల పాటు దేశంలో ఉండడానికి అనుమతిస్తుంది, అదే వ్యవధికి ఒకసారి పొడిగించవచ్చు, మొత్తం బస 180 రోజులకు మించకుండా ఉండేలా ఈ వీసా జారీ చేస్తారు.  
 
దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం, ప్రాక్సిమిటీ మార్కెట్స్ రీజినల్ హెడ్ బాదర్ అలీ హబీబ్ మాట్లాడుతూ, "భారతదేశంతో దాని దీర్ఘకాల సంబంధాన్ని విలువైనదిగా దుబాయ్ భావిస్తుంది. ఐదు సంవత్సరాల బహుళ ఎంట్రీ వీసా కార్యక్రమం భారత్‌తో ఇప్పటికే ఉన్న  సంబంధాలను మరింతగా పెంచుకునే దిశగా వేసిన  వ్యూహాత్మక   అడుగును సూచిస్తుంది. ఈ చారిత్రాత్మక మైలురాయి భారతీయ పర్యాటకులకు సుదీర్ఘమైన మరియు మరింత సుసంపన్నమైన అనుభవానికి తలుపులు తెరవడమే కాకుండా, పెరిగిన ఆర్థిక సహకారానికి వేదికను అందిస్తుంది.." అని అన్నారు.