సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (17:42 IST)

దుబాయ్ జైలులో 18ఏళ్లు.. స్వదేశానికి చేరుకున్న సిరిసిల్ల కార్మికులు

Siricilla
Siricilla
దుబాయ్ జైలులో హత్యకేసుకు సంబంధించి 18 ఏళ్లు గడిపిన తెలంగాణకు చెందిన ఐదుగురు కార్మికుల్లో నలుగురు స్వదేశానికి చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులను వారి కుటుంబ సభ్యులు బుధవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలుసుకున్న భావోద్వేగ దృశ్యాలు వీడియో ద్వారా నెట్టింట కనిపించాయి. 
 
శివరాత్రి మల్లేష్, అతని సోదరుడు శివరాత్రి రవి కుటుంబీకులు, సన్నిహితులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. దుందుగుల లక్ష్మణ్ రెండు నెలల క్రితం తిరిగి రాగా, శివరాత్రి హన్మంతు రెండు రోజుల క్రితం తిరిగి వచ్చాడు.
ఐదో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ బహదూర్ సింగ్‌ను హత్య చేసిన ఐదుగురు కార్మికులకు దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
 
 
 
గత ఏడాది సెప్టెంబర్‌లో దుబాయ్ పర్యటన సందర్భంగా అప్పటి రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు (కెటిఆర్) చేసిన విజ్ఞప్తి మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం వారి క్షమాభిక్ష పిటిషన్‌ను ఆమోదించింది. 
 
కార్మికులు తిరిగి వెళ్లేందుకు కేటీఆర్ విమాన టిక్కెట్లు ఏర్పాటు చేశారు. వీరంతా దుబాయ్‌లోని అవీర్ జైలులో ఉన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ 2011లో నేపాల్‌కు వెళ్లి షరియా చట్టం ప్రకారం రూ.15 లక్షలు పరిహారంగా లేదా దియ్యా అందజేసేందుకు మృతుడి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. 
 
అనంతరం బాధిత కుటుంబం యూఏఈ ప్రభుత్వానికి క్షమాభిక్ష పత్రాలను సమర్పించింది. అయితే, కొన్ని కారణాల వల్ల, నేర తీవ్రత కారణంగా, UAE ప్రభుత్వం క్షమాభిక్ష పిటిషన్‌ను ఆమోదించలేదు.