శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 డిశెంబరు 2023 (22:14 IST)

ఆంధ్ర ప్రదేశ్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను విస్తరించిన ఫెనెస్టా

రిటైల్ కార్యకలాపాలను విస్తరించిన ఫెనెస్టా
భారతదేశంలో అతిపెద్ద విండోస్ అండ్ డోర్స్ బ్రాండ్‌గా గుర్తింపు పొందటంతో పాటుగా తమ విభాగంలో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న, ఫెనెస్టా, మరో కొత్త షోరూమ్‌ను ప్రారంభించడంతో తమ రిటైల్ కార్యకలాపాలను విస్తరించింది. ఈ సందర్భంగా ఫెనెస్టా బిజినెస్ హెడ్ శ్రీ సాకేత్ జైన్ మాట్లాడుతూ, "విభిన్న ఉత్పత్తుల శ్రేణితో, మా కస్టమర్‌ల పట్ల మేము చూపుతున్న అంకితభావం మా స్థిరమైన వృద్ధికి తోడ్పడింది. ప్రతి నూతన షోరూమ్‌  ప్రారంభం, మా కస్టమర్లు మా పట్ల చూపుతున్న నమ్మకానికి నిదర్శనం. ఇది అసమానమైన సేవలను అందించడానికి మేము చేసిన ప్రతిజ్ఞను సైతం పునరుద్ఘాటిస్తుంది. ఈ షోరూమ్‌లు కేవలం ప్రాంగణాలు మాత్రమే కాదు; కస్టమర్‌లు మా ఉత్పత్తులలో తమను తాము లీనం చేసుకోగలిగే, మా బ్రాండ్ తత్వశాస్త్రాన్ని గ్రహించి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే డైనమిక్ పాయింట్‌లు. మా సరికొత్త షో రూమ్ ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా సమగ్రంగా విస్తరించేందుకు కొనసాగుతున్న మా మిషన్‌లో షోరూమ్ కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది" అని అన్నారు. 
 
ఆయనే మరింత గా మాట్లాడుతూ "మా భాగస్వాములు మరియు వాటాదారుల అందిస్తున్న తిరుగులేని మద్దతు మరియు చూపుతున్న మహోన్నత  నమ్మకంతో, మేము ఈ గొప్ప స్థాయికి చేరుకున్నాము. మా ప్రయాణం ఇప్పటివరకు అసాధారణమైన దానికి తక్కువ ఏమీ కాదు, ఇప్పుడు మేము రాబోయే సంవత్సరాల్లో వేగవంతమైన వృద్ధికి సిద్ధంగా ఉన్నాము. పటిష్టమైన మార్కెటింగ్ వ్యూహం, విభిన్న ఉత్పత్తుల శ్రేణి మరియు టైర్ 2 మరియు టైర్ 3 మార్కెట్‌లపై దృఢంగా దృష్టి పెట్టడం ద్వారా ఈ స్థాయి విజయం సాధించబడింది. మా విధానంలోని ప్రతి అంశం అనుబంధం మరింత గా  పెంపొందించడానికి, జ్ఞానాన్ని అందించడానికి మరియు మా విలువైన కస్టమర్‌ల కోసం శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించడానికి ఖచ్చితంగా రూపొందించబడింది..." అని అన్నారు.