బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్లు వేస్తే గుండు కొడతారు జాగ్రత్త. వీటిలో మాత్రం వేయొచ్చు
ఇంకా సంపాదన, ఆదాయమార్గాలున్న వారు ఫిక్సెడ్ డిపాజిట్లు ఎక్కడ వేసినా సమస్య లేదు. కానీ రిటైర్మెంట్ దగ్గిరపడి, లేదా రిటైర్ అయినవాళ్లకు మాత్రం మన జాతీయ బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్లు వేయడం ఏమాత్రం లాభదాయకం కాదు. ఎందుకంటే వడ్డీరేట్ల తగ్గింపు పేరుతో ఇప్పుడ
ఇంకా సంపాదన, ఆదాయమార్గాలున్న వారు ఫిక్సెడ్ డిపాజిట్లు ఎక్కడ వేసినా సమస్య లేదు. కానీ రిటైర్మెంట్ దగ్గిరపడి, లేదా రిటైర్ అయినవాళ్లకు మాత్రం మన జాతీయ బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్లు వేయడం ఏమాత్రం లాభదాయకం కాదు. ఎందుకంటే వడ్డీరేట్ల తగ్గింపు పేరుతో ఇప్పుడు పెద్దపెద్ద బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీరేటును బాగా తగ్గిస్తున్నాయి. కాబట్టి జీవితకాలం సంపాదించినదాంట్లో తాము మిగుల్చుకున్న రాబడిపై రిస్కు లేకుండా కాస్త మంచి వడ్డీని పొందాలంటో కొత్తగా ఏర్పడిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో చేయవచ్చు.
భద్రతతో కూడిన మెరుగైన రాబడుల కోసం చూస్తున్న ఇన్వెస్టర్లు సాధారణ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయటానికి బదులు... స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పేరుతో ఇటీవల కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బ్యాంకుల్ని పరిశీలించొచ్చు. ఇవి కొంచెం ఎక్కువ వడ్డీ రేటునే ఆఫర్ చేస్తున్నాయి.ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేటు ఏడాది మించితే 7 శాతాన్ని దాటడం లేదు.
మూడేళ్లు దాటిన కాల వ్యవధిగల డిపాజిట్లపై 7 శాతం కూడా ఆఫర్ చేయడం లేదు. కానీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేటు కాస్త ఎక్కువే ఉంది. ఇవి 9 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన బ్యాంకులు కావడంతో ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంచెం అదనంగా వడ్డీని అందిస్తున్నాయి. అయినప్పటికీ ఇవి రిజర్వ్ బ్యాంకు అడుగుజాడల్లోనే నడవాల్సి ఉంటుంది. కాబట్టి భద్రత విషయంలో అంత భయమేమీ అక్కర్లేదు. రిస్క్ తీసుకోకుండా... బ్యాంకుల్లోనే ఉంచుకోవాలని ఆశించే వారికి ఇవి తగినవే.
ఉదాహరణకు రూ.లక్షను పదేళ్ల కాలానికి డిపాజిట్ చేద్దామనుకుంటే... 9 శాతం వడ్డీ రేటుపై ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత అది రూ.2.45 లక్షలు అవుతుంది. అంటే రూ.1.45 లక్షల మేర వృద్ధి చెందుతుంది. అదే రూ.లక్షను తీసుకెళ్లి 6.9 శాతం వడ్డీ రేటుకు ఏ ప్రభుత్వ బ్యాంకో లేదా ప్రైవేటు బ్యాంకులోనో ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు పదేళ్ల తర్వాత ఆ మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. వడ్డీ రేటు అధికంగా ఉండటం వల్ల స్మాల్ బ్యాంకులో ఎఫ్‌డీ ద్వారా రూ.45 వేలను అధికంగా పొందే అవకాశం ఇక్కడ ఉంది.
బ్యాంకుల్లో చేసే చిన్న డిపాజిట్లకు హామీ ఉంటుంది. అంటే రూ.లక్ష వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద బ్యాంకులు చెల్లించడంలో చేతులు ఎత్తేసినా ఆ మేరకు ఖాతాదారులకు డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. ఒకవేళ బ్యాంకుల్లో కాకుండా కంపెనీల ఎఫ్‌డీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఆయా కంపెనీల గత కాలపు పనితీరు, గుర్తింపును పరిశీలించాల్సి ఉంటుంది.
ఎఫ్‌డీ చేసే ముందు ఎంత కాలానికి చేస్తున్నారు ఏ కాలానికి, ఎంత వడ్డీ రేటు అమల్లో ఉంది అనే విషయాలను వివరంగా అడిగి తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్ట్ చేస్తుంటే ఐదేళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. ఐదేళ్ల లోపు డిపాజిట్లకు ఈ పన్ను మినహాయింపు లేదు. ఇక ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10వేలు మించితే టీడీఎస్ విధిస్తారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఉపసంహరణ సమయంలో వచ్చే ఆదాయం మీ మొత్తం ఆదాయంలో కలుస్తుంది.