శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:32 IST)

పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. 9.75 శాతం వడ్డీతో..?

SBI
దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పింఛన్‌ తీసుకునేవారు, డిఫెన్స్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెన్షన్ లోన్ తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించింది. 
 
పెన్షనర్ల కోసం సరికొత్త లోన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో పెన్షనర్లు రూ.14 లక్షల వరకు లోన్ పొందవచ్చు. 9.75 శాతం వడ్డీతో పెన్షన్‌ లోన్‌ను పొందవచ్చని తెలిపింది. రిటైర్‌మెంట్‌ను హ్యాపీగా గడపవచ్చని పేర్కొంది. ఇక, ఈలోను పొందేందుకు పెన్షన్‌దారుల వయసు 76 ఏళ్లకంటే తక్కువగా ఉండాలి.
 
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలని కోరింది. పూర్తి వివరాల కోసం కస్టమర్ కేర్ నెంబర్ 1800-11-2211కు కాల్ చేయవచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ కస్టమర్ సెంటర్ నుంచి కాల్ బ్యాక్ పొందేందుకు 7208933142కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని ఎస్బీఐ తెలిపింది.