1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 మే 2024 (22:01 IST)

దేశంలో డెయిరీ ఫామ్ లోన్‌లలోకి ప్రవేశించిన గోద్రెజ్ క్యాపిటల్

Dairy Farm Loans
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ యొక్క ఆర్థిక సేవల విభాగం అయిన గోద్రెజ్ క్యాపిటల్, డైరీ ఫామ్ రుణాలను ప్రారంభించడంతో వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. క్రీమ్‌లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ద్వారా ఈ-డెయిరీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర ప్రాంతాలలోని చిన్న డైరీ ఫామ్ యజమానులకు ఆర్థిక సహాయం గోద్రెజ్ క్యాపిటల్ అందించనుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ యొక్క డైవర్సిఫైడ్ ఫుడ్ అండ్ అగ్రి-బిజినెస్ సమ్మేళనం అయిన గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ (GAVL)కి అనుబంధ సంస్థ క్రీమ్‌లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇది గోద్రెజ్ జెర్సీ బ్రాండ్ పేరిట తమ ఉత్పత్తులను విక్రయిస్తుంది.
 
భారతదేశంలో పాల ఉత్పత్తుల వినియోగం క్రమంగా పెరుగుతూనే ఉంది, ఇది పాడి రైతులకు అవకాశాలు, సవాళ్లు రెండింటినీ అందిస్తుంది. ఈ రంగంలో ఉత్పాదకతను మెరుగుపరచడానికి, ఆర్థిక లబ్దిని పెంచడానికి అనువైన ఫైనాన్సింగ్‌తో ఈ రైతులకు సాధికారత కల్పించడం యొక్క ఆవశ్యకతను గోద్రెజ్ క్యాపిటల్ గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం, రైతులకు అవకాశాలను సులభతరం చేయడానికి తమ భాగస్వామిగా ద్వార ఈ-డెయిరీతో కలిసి గోద్రెజ్ క్యాపిటల్ పనిచేస్తుంది.
 
డెయిరీ ఫామ్ రుణాలతో, GAVL వద్ద ఎంప్యానెల్ చేయబడిన రైతులకు పశువుల కొనుగోలు, నిర్వహణ కోసం తనఖా రహిత రుణాన్ని గోద్రెజ్ క్యాపిటల్ అందిస్తుంది. పూర్తి డిజిటలైజ్ చేయబడిన ప్రక్రియ, వేగవంతమైన మంజూరు, రుణ వితరణ, రెండు సంవత్సరాల వరకు సౌకర్యవంతమైన చెల్లింపు అవకాశాలతో సహా ఇతర ప్రయోజనాలతో పాటు రుణాలను సౌకర్యవంతంగా పొందేలా డెయిరీ ఫామ్ యజమానులకు ఈ లోన్ ఆఫరింగ్ అవకాశాలను అందిస్తుంది.
 
గోద్రెజ్ క్యాపిటల్ ఎండి-సీఈఓ, మనీష్ షా మాట్లాడుతూ, "మన దేశపు రైతులకు మా మద్దతును అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ విభాగంలో కార్యకలాపాలు ప్రారంభించాలనే నిర్ణయం పాడి రైతు సమాజానికి ఆర్థిక సహాయం అందించడం, వేల్యూ చైన్ అంతటా ఆర్థిక చేరికను ప్రోత్సహించడం, ఈ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడం అనే ఆలోచనకు ప్రతిస్పందనగా వచ్చింది. కృష్ణగిరి జిల్లాలో మొదటి రుణం అందించటం కేవలం ప్రారంభం మాత్రమే. మేము తమిళనాడులోని ఇతర ప్రాంతాలలో పాడి పరిశ్రమ రైతులను చేరుకోవడానికి, ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మా మద్దతును అందించడానికి ప్రయత్నిస్తున్నందున, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.." అని అన్నారు. 
 
పరిమితులు ఉన్నప్పటికీ, 80 మిలియన్ల మంది రైతుల జీవనోపాధికి మద్దతునిస్తూ భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కీలక సహకారాన్ని పాడి పరిశ్రమ అందిస్తోంది. మొత్తం పాల ఖర్చులో 70% వాటాతో దాణా అనేది ఆరోగ్యకరమైన పాడి పరిశ్రమలో అత్యంత కీలకమైన అంశంగా నిలవడంతో పాటుగా పశువుల పాల ఉత్పాదకతను ప్రభావితం చేసే అతి పెద్ద అంశంగానూ మారింది తద్వారా రైతు ఉద్ధరణకూ తోడ్పడుతుంది. నిరంతర పాల దిగుబడి కోసం పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన రైతులకు తగిన వనరులను అందించడానికి సరైన దృష్టి అవసరం.
 
గోద్రెజ్ జెర్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భూపేంద్ర సూరి మాట్లాడుతూ, “మెరుగైన పశువుల ఆరోగ్యం, పశువులకు మంచి శ్రేయస్సును నిర్ధారిస్తుంది . రైతులు మంచి దిగుబడిని పొందేలా చేస్తుంది, తద్వారా వారి లాభదాయకతను పెంచుతుంది. అందువల్ల, పాడి రైతులకు నాణ్యమైన మేతను పొందేలా చేయడంలో, గోద్రెజ్ క్యాపిటల్ మరియు ద్వార ఈ-డెయిరీల మధ్య ఈ భాగస్వామ్యం, వారి దాణా, ఇతర వ్యవసాయ అవసరాలకు సులభంగా ఫైనాన్స్‌ను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం ద్వారా, మా రైతులు పశువుల జనాభాను పెంచవచ్చు. అధిక ఉత్పాదకత మరియు మెరుగైన సంపద కోసం కృషి చేయవచ్చు" అని అన్నారు.