ఈ బంగారాన్ని పట్టుకోండి బాబోయ్... పడిపోతోంది ధర....
బంగారం ధరం ఇష్టమొచ్చినట్లు పడిపోతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 150 తగ్గిపోయి రూ.32,470 వద్ద నిలిచింది. జ్యూయెలరీ, రిటైలర్ల నుంచి భారీగా డిమాండ్ తగ్గిపోవడంతో బంగారం ధర పడిపోయినట్లు చెపుతున్నారు. పసిడి ధర ఇలా రోజురోజుకీ పడిపోతుండటంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇకపోతే వెండి ధరలో మార్పేమీ లేదు. కిలో వెండి ధర రూ.37,700 వద్ద కొనసాగింది. బంగారం ధర తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,420 వద్ద నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,920కు మేరకు తగ్గింది.