మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (11:51 IST)

Gold: 14 ఏళ్ల తర్వాత భారీగా పెరిగిన బంగారం ధరలు.. రికార్డు స్థాయిలో నమోదు

gold
బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు గురయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు,  ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల మధ్య 14 సంవత్సరాలలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి.
 
సెప్టెంబర్‌లో ఇప్పటివరకు బంగారం ధర 11.4 శాతం పెరిగింది. ఫలితంగా ఆగస్టు 2011 తర్వాత బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బంగారం డిమాండ్ కారణంగా ఇది 15 శాతం పెరిగింది. 
 
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన డేటా ప్రకారం, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర మంగళవారం రూ. 1,15,450 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. డిసెంబర్ డెలివరీ కోసం అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి రూ.3,872కి చేరుకుంది.