శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (18:28 IST)

హయర్ ఇండియా నుంచి కొత్త ఓఎల్ఈడీ ప్రో టీవీ

హయర్, గృహోపకరాలు మరియు వినియోగ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గ్లోబల్ లీడర్ మరియు వరుసగా 13 సంవత్సరాల పాటు మేజర్ అప్లయెన్సెస్‌లో నెంబర్ 1 బ్రాండ్‌గా నిలవగా, వినియోగదారులకు సునిశితమైన మెటల్-బీజెల్-లెస్ డిజైన్‌తో అసలైన వినోద అనుభవాన్ని అందించడం కోసం, వినియోగదారులకు మరింత లీనమయ్యేలా వీక్షణ అనుభవం కోసం, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందించడానికి, ఇండియాలో తన కొత్త అల్ట్రా-స్లిమ్ 4.9 ఎంఎం OLED TVని లాంఛ్ చేసింది. అంతే కాదు, విస్తృతపరచిని హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్ కోసం ఫార్-ఫీల్డ్ వాయిస్ అసిస్టెన్స్‌ ఏర్పాటుతో హయర్ యొక్క కొత్త ఆండ్రాయిడ్ పవర్డ్ OLED టీవీ లభిస్తుంది.   

 
కోట్ల కొద్దీ సెల్ఫ్-ఇల్యూమినేటింగ్ పిక్సెల్స్, 4కే రిజొల్యూషన్‌తో, హయర్ యొక్క కొత్త OLED టీవీని, అత్యంత గాఢమైన ప్యూర్ బ్లాక్స్‌తో అసాధారణమైన వాస్తవిక చిత్రాలనను అందించేలా డిజైన్ చేశారు. అమితంగా వీక్షించడంతోటు మరెన్నో చేయడానికి అనువుగా తగిన ప్రోడక్ట్‌గా రూపొందించడం కోసం దీనిని అనేక ఫీచర్లతో పాటు పవర్ ప్యాక్ చేశారు, ఇందులో వినియోగదారు అనుభూతి పైనే కీలకంగా దృష్టి నిలిపారు.

 
డిస్‌ప్లే మరియు పిక్చర్ నాణ్యత
కొత్త హయర్ OLED టీవీ సజీవంగా ఉండే సహజ రంగులను మరియు అద్భుతమైన పిక్చర్ నాణ్యతను అందించే విధంగా రూపొందించబడింది, ఇది లీనమైపోయేంతటి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. దీని డిస్‌ప్లేలో స్వచ్ఛమైన నలుపు రంగు, చిక్కటి రాత్రికి సమీపంగా ఉంటుంది, ఇది పిక్చర్‌లోని సబ్జెక్ట్‌ను మరింత స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. ఇన్‌టెన్స్ కాంట్రాస్ట్ డీటెయిల్స్‌తో పాటు రిచ్ షేడింగ్ డీటెయిల్స్...  అసంఖ్యాక రంగులతో అద్భుతమైన చిత్ర నాణ్యతను వాటి వాస్తవ రూపంలో అందిస్తాయి.
 
కొత్త OLED టీవీ డాల్బీ విజన్ యొక్క జోడించబడిన ప్రయోజనంతో పాటు లభిస్తుంది- ఇది హై డైనమిక్ రేంజ్‌ (HDR)ను వైడ్ కలర్ గామట్ సామర్ధ్యాలతో మిళితం చేసిన అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సినిమాల రూపకర్తల మరియు క్రియేటర్లు డాల్బీ విజన్లో వినోదాన్ని సజీవంగా అందించడం కోసం శక్తివంతమైన కెమెరాలు మరియు ప్రత్యేక నిర్మాణ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. హయర్ OLED టీవీతో, వినియోగదారులు ఈ ఫీచర్‌ని తమ ఇంటి నుంచే ఆస్వాదించగలరు.