కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న వేళ, ఇంటిలోనే ఉండటం, చేతులు తరచుగా కడగడం, మాస్కులు ధరించడం మరియు ఆరోగ్యవంతమైన, సురక్షితమైన ఆహారం తినడం, వైరస్ బారిన పడకుండా బలీయమైన వ్యాధి నిరోధక శక్తిని నిర్మించుకోవడం మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అయితే రోగ నిరోధకశక్తి నిర్మాణంలో మరియు మొత్తంమ్మీద ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంలో రుచి, ఆరోగ్యం, సౌకర్యం కలగలసిన అవకాశాలు ఏమున్నాయోనని ఆలోచిస్తున్నారా? అయితే 24 మంత్ర ఆర్గానిక్ యొక్క తాజా శ్రేణి ఆర్గానిక్ ఇన్ఫ్యూజన్స్ వైపు దృష్టి సారించండి.
అనాది కాలంగా ఎంతోమంది విశ్వసిస్తోన్న మన వంటిల్లే మన ఔషధాలయం అనే నానుడి స్ఫూర్తితో 24 మంత్ర ఆర్గానిక్ ఇప్పుడు తులసి, వేప, పసుపు, అల్లం వంటి నాలుగు పదార్థాలను జోడించిన ఆర్గానిక్ హానీ ఇన్ఫ్యూజ్డ్ తేనెను విడుదల చేసింది. అత్యధిక యాంటీ ఆక్సిడెంట్లు, కొన్ని పోషకాల పరంగా ఎక్కువ మంది సేవించడానికి ఇష్టపడే తేనెతో ఎన్నో ప్రయోజనాలు సైతం ఉన్నాయి. గుండె ఆరోగ్యంపై మెరుగైన ప్రయోజనాలు చూపుతూనే, కొలెస్ట్రాల్ తగ్గించడం, చిన్నారులలో దగ్గు తగ్గడానికి, కాలిన గాయాలు నయం కావడానికి తేనె తోడ్పడుతుంది.
ఇప్పుడు తేనెతో పాటుగా అదనంగా తులసి, వేప లాంటివి సైతం జోడించడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడటంతో పాటుగా రక్తపోటు తగ్గడం, గొంతు ఇన్‌ఫెక్షన్లు, అలెర్జీలు తగ్గడం జరుగుతుంది. ఇక అధ్యయనాలు తులసితో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గుతుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, అలాగే అల్లంతో క్యాన్సర్ నివారించవచ్చని, పసుపుతో చర్మ సౌందర్యం మెరుగుపడటంతో పాటుగా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని వెల్లడిస్తున్నాయి.
ఈ ఇన్యూజన్స్ జోడించిన 250 గ్రాముల తేనె బాటిల్ ఒక్కోటి 160 రూపాయల ధరలో అందిస్తున్నారు. ఈ ఉత్పత్తులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలోని 24 మంత్ర ఫార్మ్ స్టోర్‌లతో పాటుగా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా రిటైల్ స్టోర్స్‌లో , అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్, మిల్క్ బాస్కెట్ లాంటి ఈ-కామర్స్ సైట్లు, స్పార్, స్పెన్సార్, మెట్రో, వాల్ మార్ట్, స్టార్‌బజార్ మొదలైన సూపర్‌మార్కెట్‌లలో లభ్యం కానున్నాయి.
ఈ నూతన ఆవిష్కరణపై 24 మంత్ర ఆర్గానిక్ సీఈవో ఎన్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన ఆహారం వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో కార్యకలాపాలను తాము 2004లో ఆరంభించాం. మహమ్మారి సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం ప్రజలకు అందించడంలో భాగంగా నూతన శ్రేణి తేనె ఇన్ఫ్యూజన్స్‌ను విడుదల చేశాం. మారుతున్న వినియోగదారుల డిమాండ్‌లు, ప్రాధాన్యతలకనుగుణంగా వేగంగా తాము స్పందించడానికి నిదర్శనంగా ఈ ఉత్పత్తులు నిలుస్తాయి అని అన్నారు.