శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 జూన్ 2021 (16:39 IST)

హైడిశ్చార్జ్‌- హై హెడ్‌ పోర్టబుల్‌ వాటర్‌ పంపులను కోరుకునే రైతుల అవసరాలను తీర్చిన హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌

భారతదేశంలో పవర్‌ ప్రొడక్ట్స్‌ తయారీపరంగా సుప్రిసిద్ధ సంస్థలలో ఒకటైన హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఐపీపీ) నేడు రైతుల వ్యవసాయ భూముల నీటి పారుదల అవసరాలను సమర్థవంతంగా మరియు అత్యంత అందుబాటు ధరలలో, రెండు అంగుళాలు మరియు మూడు అంగుళాల విభాగాలలో సెల్ఫ్‌ ప్రైమింగ్‌–గ్యాసోలిన్‌ (పెట్రోల్‌) ఆధారిత నీటి పంపులను విడుదల చేసింది.
 
పంట సాగు కోసం మెరుగైన నీటి పారుదల వసతుల కోసం వెతికే రైతులకు తేలికపాటి మరియు ఆర్థికపరంగా అందుబాటు ధరలలోని పంపులను కోరుకుంటున్నారు. తమ దిగుబడులను తమ పంటకు అవసరమైన రీతిలో మెరుగైన నీటి పారుదల అందించినప్పుడు మాత్రమే మెరుగ్గా పొందగలమని వారు భావిస్తున్నారు. గ్యాసోలిన్‌ ఇంధన నీటి పంపుల విభాగంలో హెచ్‌ఐపీపీ ఇప్పుడు మార్కెట్‌ అగ్రగామిగా నిలువడంతో పాటుగా గత 35 సంవత్సరాలుగా 2 నుంచి 5 హెచ్‌పీ శ్రేణిలో పంపు సెట్లను అందిస్తూ రైతుల అవసరాలను తీరుస్తుంది.
 
ఈ తాజా శ్రేణి డబ్ల్యుబీ 20ఎక్స్‌డీ మరియు డబ్ల్యుబీ 30ఎక్స్‌డీ మోడల్స్‌ ఇప్పుడు కొండ ప్రాంతాలతో పాటుగా మెట్టభూములలో సైతం పంటలకు అవసరమైన నీటి అవసరాలను తీరుస్తాయి. తద్వారా భారతదేశంలో విభిన్నమైన ప్రాంతాలు, విభాగాల వ్యాప్తంగా రైతులకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. రెండు అంగుళాల విభాగపు మోడల్‌– డబ్ల్యుబీ 20ఎక్స్‌డీ. తమ శ్రేణిలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ ఇది నీటిని 32 మీటర్లు హెడ్‌తో నిమిషానికి 670 లీటర్ల డిశ్చార్జ్‌ వాల్యూమ్‌ కలిగి ఉంటుంది. అదే సమయంలో ఇది గరిష్టంగా 24 కేజీల బరువు మాత్రమే కలిగి ఉంటుంది. తద్వారా కొండ ప్రాంతాలలో రైతుల సాగు అవసరాలను తీరుస్తూ, అతిసులభంగా మోసుకుపోయే రీతిలో ఉంటుంది.
 
మూడు అంగుళాల విభాగపు మోడల్‌–30ఎక్స్‌డీ. ఇది రైతుల ఆర్ధిక, సమయానుకూల., సమర్థవంతమైన సాగునీటి అవసరాలను సాధారణ భూములలో అత్యున్నత శ్రేణి పనితీరుతో తీరుస్తుంది. ఇది నిమిషానికి 1100 లీటర్లను వెదజల్లడంతో పాటుగా 23 మీటర్ల హెడ్‌ కారణంగా బావులు, కాలువలు, చెరువులు నుంచి కూడా నీటిని తోడేందుకు తోడ్పడుతుంది. తద్వారా ఉత్పాదనలు మెరుగుపరుచుకోవడానికీ తోడ్పడుతుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి గగన్‌ పాల్‌, వైస్‌ ప్రెసిడెంట్‌- హెడ్‌ ఆఫ్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ సర్వీస్‌- హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘భారతీయ రైతులు గ్యాసోలిన్‌ శక్తితో పనిచేసే హోండా నీటిపంపులను ఎంచుకోవడంలో తమ విశ్వాసం చూపుతున్నారు. తమ అవసరాల కోసం ఇతర ఉత్పత్తుల కన్నా వీరు ఇంధన పొదుపు, పోర్టబిలిటీ, అతి సులభమైన నిర్వహణ మరియు పర్యావరణ అనుకూలత వంటి అంశాలతో కూడిన మొత్తం హోండా ప్రొడక్ట్స్‌నే ఎక్కువగా అభిమానిస్తున్నారు. హోండా వాటర్‌ పంపుల యొక్క స్థిరమైన పనితీరు సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే వీటిని సుదీర్ఘకాలం పాటు నిలిచి ఉండేలా తీర్చిదిద్దారు. వీటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 600 మంది సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ డీలర్‌షిప్స్‌‌తో కూడిన నెట్‌వర్క్‌ తోడ్పాటునందిస్తుంది. ఈ రెండు నూతన మోడల్స్‌ మరింత విస్తృతమైన వ్యవసాయ సాగునీరు అవసరాలు తీర్చడంతో పాటుగా మరింతగా హోండా యొక్క నీటి పంపుల కవరేజీ మరియు మార్కెట్‌ వాటాను సైతం వృద్ధి చేయనున్నాయి’’ అని అన్నారు.
 
నూతనంగా ఆవిష్కరించిన వాటర్‌ పంపులు ఇప్పుడు హోండా యొక్క రిటైల్‌ డీలర్‌షిప్‌ ఔట్‌లెట్ల వద్ద దేశవ్యాప్తంగా లభ్యమవుతాయి. మరింత సమాచారం hondaindiapower.com వద్ద లభ్యమవుతుంది.