గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (17:02 IST)

అద్దె, సంబంధిత సేవల వేదిక హౌసింగ్‌ ఎడ్జ్‌ను ఆవిష్కరించిన హౌసింగ్‌ డాట్‌ కామ్

ఇలారా టెక్నాలజీస్‌కు సొంతమైన భారతదేశపు సుప్రసిద్ధ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌, హౌసింగ్‌ డాట్‌ కామ్‌ తమ వినూత్నమైన, పూర్తిస్థాయి అద్దె మరియు సంబంధిత సేవల వేదిక హౌసింగ్‌ ఎడ్జ్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. దీనిద్వారా బహుళ సేవలను కంపెనీ డిజిటలీకరించనుంది.
 
హౌసింగ్‌ ఎడ్జ్‌తో తమ ఇల్లు వదలకుండానే గృహ యజమానులు, అద్దెదారులు సౌకర్యవంతంగా సేవలను పొందగలరు. అటు యజయానులతో పాటుగా అద్దెదారులకు సైతం లభ్యమయ్యే ఈ సేవలలో ఆన్‌లైన్‌ అద్దె చెల్లింపు, ఆన్‌లైన్‌ అద్దె ఒప్పందాలు, అద్దెదారుని ధృవీకరణ, ప్యాకేజింగ్‌ మరియు తరలింపు, ఫర్నిచర్‌ అద్దె, హోమ్‌ ఇంటీరియర్స్‌ మరియు గృహ సేవలు వంటివి భాగంగా ఉంటాయి.
 
అధికశాతం హౌసింగ్‌ ఎడ్జ్‌ సేవలు ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, పూనెలలో లభ్యంకానుండగా, త్వరలోనే మిగిలిన నగరాలలో సైతం లభ్యమవుతాయి. ‘‘అసాధారణ సాంకేతికాధారిత ఆవిష్కరణలను హౌసింగ్‌ ఎడ్జ్‌ తీసుకువస్తుంది. ఇప్పటికే కొనుగోలుదారులకు  ఏకీకృత పరిష్కారంగా పనిచేయడం ద్వారా భారతదేశంలో ఆస్తుల లావాదేవీలు జరుగుతున్న తీరును మేము మార్చాము. అదే తరహా నమూనాను అనుబంధ సేవల విభాగంలో సైతం అందించాలనే లక్ష్యంతో, ఈ కంపెనీ సృజనాత్మక సాంకేతిక పరిష్కారాలను అందిస్తుంది..’’ అని ధృవ్‌ అగర్వాల, గ్రూప్‌ సీఈవొ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.
 
మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసంగ్‌ డాట్‌కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌, ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ మాట్లాడుతూ ‘‘మార్కెట్‌పై బలీయమైన ప్రభావం చూపడంతో పాటుగా మొత్తంమ్మీద ఈ వ్యవస్ధలో మార్పు తీసుకువచ్చే సృజనాత్మక ఉత్పత్తులు, సేవలను  అందించాలన్నది  మా లక్ష్యం.
 
ఈ లక్ష్యంతోనే మేము గృహ యజమానులతో పాటుగా గృహాల కోసం వెదుకుతున్న వారికి సైతం సరళీకృత ప్యాకేజీలను విడుదల చేశాం. ఈ మొత్తం ప్రయాణం క్లిష్టత లేని రీతిలో మలిచేందుకు మేము దేశంలో అత్యున్నత బ్రాండ్లతో భాగస్వామ్యం చేసుకున్నాం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇప్పుడు భారతదేశంలో అద్దెదారులతో పాటుగా యజమానులకు సైతం ఏకీకృత పరిష్కారంగా హౌసింగ్‌ ఎడ్జ్‌ను నిలుపనున్నాయి’’ అని అన్నారు.